సంగీతం—నాదవేదం—2
11—07—2020; శనివారము. నాదం:— ఈ మంగళమయ పదము, దీని మూలభావనారూపమైన దివ్యతత్త్వము కేవలం ఋషుల రసమయదర్శనానుభవమునుండి వారి అమేయతపఃఫలముగా ఆవిర్భవించేయి. ” ‘న’కారం ప్రాణనామానం ‘ద’కారం అనలో విదుః|జాతః ప్రాణాగ్ని సంయోగాత్ తేన నాదోsభిధీయతే”||(సంగీతరత్నాకరం) ‘న’కారం ప్రాణరూపంగాను, ‘ద’కారం అగ్నిరూపంగాను ఆర్షవిదులు దర్శించేరు. (సజీవమైన మానవదేహంనుండి బయలువెడలే)...