Saaradaa Bhaarati Blog

0

సంగీతం—నాదవేదం—22

28—11—2020; శనివారము. 22వ జనకరాగం అయిన ఖరహరప్రియ నుండి జన్యరాగం దర్బారు గురించి, దర్బారు రాగ కృతులు గురించి చర్చించుకున్నాం. ఇప్పుడు మరొక జన్యరాగం ఐన దేవమనోహరి లో త్యాగరాజస్వామివారు కూర్చిన ఎవరికై యవతారమెత్తితివో (చాపుతాళం); కన్నతండ్రి! నా పై కరుణ మానకే, గాసి తాళనే (దేశాదితాళం);...

0

సంగీతం—నాదవేదం—21

21—11—2020; శనివారం. ఈ వారం కూడా 22~జనకరాగం~ఖరహరప్రియ నుండి జన్యరాగాల పరిచయం కొనసాగిస్తున్నాం! జయనారాయణి రాగం/ఆదితాళం లోకూర్చబడిన మనవిని వినుమా! మరవ సమయమా! అనే కృతి జనప్రియమైనదే! జయమనోహరి రాగంలో నీ భక్తిభాగ్యసుధానిధి—రూపకతాళం లోని కృతి అరుదుగా వింటాం! ఇదే రాగంలో, ఆదితాళంలో రచించబడిన కృతి యజ్ఞాదులు...

0

సంగీతం—నాదవేదం—20

07—11—2020; శనివారము. 22 వ జనకరాగం—ఖరహరప్రియ నుండి జన్యరాగాలని అకారాదిగా పరికిస్తే వచ్చే మొట్టమొదటి రాగం మహామధురమైన ఆభోగి రాగం. ఈ ఆభోగిరాగంలో త్యాగయ్యగారు—నన్ను బ్రోవ నీకింత తామసమా! నా పై నేరమేమి? బల్కుమా! (దేశాదితాళం); మనసు నిల్ప శక్తి లేకపోతే (ఆదితాళం); నీలకంఠ! నిరంజన! (రూపకతాళం)...

0

సంగీతం—నాదవేదం—19

07—11—2020; శనివారము. ఇప్పుడు 22—వ మేళకర్త రాగం అయిన ఖరహరప్రియ రాగం గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం! జనకరాగం ఐన ఖరహరప్రియ—వేదచక్రం లోని నాలుగవరాగం. దీనిలోని స్వరక్రమం యిది:— ఆధార స-చతుశ్శ్రుతి రి-సాధారణ గ-శుద్ధ మ-ప-చతుశ్శ్రుతి ధ-కైశికి ని-పై స ఆరోహణ—అవరోహణ లలో ఇవే స్వరాలు ఉంటాయి. అందువలన...

0

సంగీతం—నాదవేదం—18

31—10—2020; శనివారము. సంక్షిప్తంగా 20—వ మేళకర్తరాగం ఆ పైన ఆ జనకరాగం నుండి జన్యరాగాలు అయినవాటిలో ప్రధానమైన కొన్ని రాగాలని, ఆ రాగాలలో కూర్చబడిన కొన్ని ముఖ్యకృతులని గురించి తెలుసుకున్నాం. ఈ వారం 21—వ మేళకర్తరాగం ఐన కీరవాణి గురించి ఇప్పుడు పరిచయం చేసుకుందాం! కీరవాణి నాలుగవదైన...

0

సంగీతం—నాదవేదం—17

24—10—2020; శనివారము. 20-వ మేళకర్త/జనకరాగం నుండి ఆవిర్భవించిన రాగమైన భైరవి ని సాక్షాత్తూ సకలాలంకార సుశోభిత భైరవీదేవతామాత యొక్క అపురూపమైన అందౘందాలని వ్యక్తం చేసే మహామహిమాన్వితరాగం అని అభివర్ణించవలసినదే! అందువలననే దక్షిణభారత సంగీత మూర్తిత్రయం అంటే త్యాగరాజస్వామి, ముద్దు(త్తు)స్వామి దీక్షితులు,శ్యామాశాస్త్రులవారు ముగ్గురూ వివిధ విలక్షణ సుసజ్జిత సంగీతకృతులని...

0

సంగీతం—నాదవేదం—16

17—10—2020; శనివారము. ఇప్పుడు 19—వ మేళకర్త రాగం అయిన జనకరాగం ఝంకారధ్వని లో కూర్చబడిన సంగీతకృతులని పరిచయం చేసుకుందాం. ఈ రాగంలో త్యాగరాజస్వామివారు స్వరరచన చేసిన కృతి ఫణిపతిశాయి మాం పాతు(ఆదితాళం) కృతి అప్పుడప్పుడు వినిపిస్తుంది! దీక్షితులవారి పద్ధతిలో ఇదే రాగాన్ని ఝంకారభ్రమరి అని పిలుస్తారు. ఈ...

0

సంగీతం—నాదవేదం—15

X—X—2020; శనివారము. ఇప్పుడు 13 వ మేళకర్త రాగం అయిన గాయకప్రియ రాగం ప్రస్తావిస్తే, ఈ రాగంలో అయ్యవారు కృతిని ఏదీ చేసినట్లు కానరాదు. ఈ జనకరాగం నుండి వచ్చిన జన్యరాగం అయిన కలకంఠి రాగం లో, ఆదితాళంలో, శ్రీజనకతనయే! శ్రితకమలాలయే అనే మహారమణీయము, మధురము అయిన...

0

సంగీతం—నాదవేదం—14

03—10—2020; శనివారము. ఇప్పుడు రసజ్ఞలోకంలో బాగా ప్రచారంలో ఉన్న సుప్రసిద్ధ రాగాలని గురించి సంక్షిప్తంగా పరిచయం చేసుకుందాం! నేను ఈ సందర్భానికి త్యాగయ్య-దీక్షితులు-శ్యామాశాస్త్రి వర్యుల కృతులని — అంటే సంగీత త్రిమూర్తులు రచనలని మన అధ్యయనానికి ప్రధాన ఆధారంగా తీసుకుంటున్నాను. ముగ్గురిలోను త్యాగయ్యగారి రచనలకి ఉన్న లోకాదరణ...

0

సంగీతం—నాదవేదం—13

26—09—2020; శనివారం. దక్షిణభారత శాస్త్రీయసంగీత సిద్ధాంత ప్రవర్తకులు 72~మేళకర్త రాగాలు అనే వ్యవస్థని ఏర్పాటు చేసేరు అని తెలుసుకున్నాం! ఈ మేళకర్త రాగాలనే జనక రాగాలు అనికూడా పిలుస్తారు. కర్ణాటక సంగీత మూర్తిత్రయంగా పిలువబడే త్యాగరాజస్వామి-ముద్దు(త్తు)స్వామి దీక్షితులు శ్యామాశాస్త్రి అని చరిత్రప్రసిద్ధులైన ముగ్గురు వాగ్గేయకారులగురించి సంగీతప్రియులు అందరూ...