Category: Saahityamu-Souhityamu

2

సాహిత్యము-సౌహిత్యము – 45 : భారతార్థంలో నిను నిను నిన్ను నిన్ను మరి నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్

శ్రీశారదా కారుణ్య కౌముది| 17—03—2017;  శనివారము.”సాహిత్యము—సౌహిత్యము~45″. ~ “పునరుక్తి చమత్కృతి” పరంపరలో ఈ వారంకూడా క్రితంవారం ‘చంపకమాల‘ పద్యపాదసమస్యనే పరికిద్దాం. పూరణచేసిన కవిగారుకూడా శ్రీ మోచర్ల వెంకన్నగారే!సమస్యని మళ్ళీ ఇక్కడ సౌలభ్యంకోసం ఉదహరించుకుందాం.సమస్య:—“నిను నిను నిన్ను నిన్ను మరి నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్ “| ఇది...

5

సాహిత్యము-సౌహిత్యము – 44 : నిను నిను నిన్ను నిన్ను మరి నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్

ఐం శ్రీశారదాదేవ్యై నమః| శ్రీశారదా దయా చంద్రికా| 10—03—2018; శనివారము. “సాహిత్యము—సౌహిత్యము~44”. ఈ వారంకూడా “పునరుక్తి చమత్కృతి”కి చెందిన మరొక సమస్యాపూరణం తెలుసుకుందాం. సమస్య:— “నిను నిను నిన్ను నిన్ను మరి నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్ |” ఈ సమస్యాపూరణం చేసిన సరసకవివరులు శ్రీ మోచర్ల...

7

సాహిత్యము-సౌహిత్యము – 43 : అందరు అందరే కడకు అందిరి కొందరె కొందరందరే

శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తిః| 03—03—2018;  శనివారము.”సాహిత్యము—సౌహిత్యము~43″.శ్రీ కిరణ్ సుందర్ బాలాంత్రపు, చెన్నై, “సాహిత్యము – సౌహిత్యము~41” (17—02—2018) లోని “అందరు అందరే – – –” సమస్యాపూరణకి అందంగా స్పందిస్తూ, తమ “Comments” విభాగంలో, మన ప్రస్తుత ప్రకరణానికి అనుగుణమైన (ఉత్పలమాల పద్యపాదంలో) ఒక సరసమైన భావనని...

3

సాహిత్యము-సౌహిత్యము – 42 : వారికి వారికిన్ మరియు వారికి వారికి వారివారికిన్

శ్రీశారదా దయా చంద్రికా :— 24—02—2018; శనివారము. “సాహిత్యము—సౌహిత్యము~42”. ఈ వారంకూడా మరొక “పునరుక్తి చమత్కృతి” వర్గానికిచెందిన సమస్యాపూరణం చూద్దాము. ఇప్పుడు, అమరావతిని ముఖ్యపట్టణంగాచేసుకుని, ఆంధ్రావనిని పాలించిన రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడుగారి ఆస్థానంలో, వట్ఠెం విరూపాక్షశాస్త్రిగారి ద్వారా చేయబడిన సమస్యాపూరణ ప్రాగల్భ్యం పరికిద్దాం! సమస్య:— “వారికి వారికిన్...

8

సాహిత్యము-సౌహిత్యము – 41 : అందరు అందరే మరియు అందరు అందరె అందరందరే!

శ్రీశారదా దయా కౌముదీ:— 17—02—2018;  శనివారము.”సాహిత్యము—సౌహిత్యము~41″. గతవారం సమస్యాపూరణం ౘదివి, తన వ్యాఖ్యపొందుపరిచిన మా తమ్ముడు “సి. యస్ .”, సహజ రసజ్ఞత కలిగినవాడు కనుక నాకు ఒక రసమయమైన ‘కొస’ని అందించేడు. ఆ కొస యిది: “అందరు అందరే మరియు అందరు అందరె అందరందరే!”|| ఈ...

5

సాహిత్యము-సౌహిత్యము – 40 : నీవును నీవునున్ మరియు నీవును నీవును నీవు నీవునున్

శ్రీశారదా దయా దీపికా :— 10—02—2018;  శనివారము.”సాహిత్యము – సౌహిత్యము ~ 40″| విశాఖపట్టణం, ఆంధ్రవిశ్వవిద్యాలయంలో, “భువనవిజయం” సాహిత్యరూపక ప్రదర్శన ౘాలా ౘక్కని వాతావరణంలో, ప్రేక్షకజన హృదయహర్షప్రదాయకంగా జరుగుతోంది. అందులో, రసికజనరంజక కవివరులు, “కరుణశ్రీ”జంధ్యాల పాపయ్యశాస్త్రిగారు పాల్గొన్నారు. ఆ సందర్భంలో ఒక “సమస్య” వచ్చింది. “నీవును నీవునున్ మరియు...

2

సాహిత్యము-సౌహిత్యము – 39 : దివ్వె వెలుంగుచుండిన గదిన్ నలువైపులనిండె చీకటుల్

శ్రీశారదా  వాత్సల్య  దీపకళిక  :— 03—02—2018; శనివారము. “సాహిత్యము—సౌహిత్యము~39″|| ప్రముఖ కవి, పండితులు,సమస్యాపూరణకోవిదులు, మన శీర్షికలో మనకి సుపరిచితులు ఐన శ్రీ కోడూరి సాంబశివరావుగారి మరొక కరుణారసపూర్ణ సమస్యాపూరణని పరికిద్దాం! సమస్య:— “దివ్వె వెలుంగుచుండిన గదిన్ నలువైపులనిండె చీకటుల్ “| “దీపం వెలుగుతున్న గదిలోనే నాలుగు వైపులనుండి చీకటులు ఆవరించుకుంటున్నాయి”...

5

సాహిత్యము-సౌహిత్యము – 38 : సారా తెమ్మనె రాఘవుండు హనుమన్ సంరంభమేపారగన్

శ్రీశారదా వాత్సల్య దీపికా | “సాహిత్యము—సౌహిత్యము~38. 27—01—02018; శనివారము. ఈ వారంకూడా శ్రీ బేతవోలు రామబ్రహ్మవర్యుల అనుపమాన సమస్యాపూరణ ధౌరంధర్యాన్ని, మరొకమారు ౘవిచూద్దాము! సమస్య:— “సారా తెమ్మనె రాఘవుండు హనుమన్ సంరంభమేపారగన్ ” “శ్రీరాముడు మంచి హడావుడిగా, ఆంజనేయుడిని ‘సారా’ అంటే తెలుగు గ్రామ్యభాషలో, మత్తుపానీయం, తీసుకురమ్మన్నాడు”...

1

సాహిత్యము-సౌహిత్యము – 37 : హృదయము చీల్ప రత్నములు, హేమములున్  కనవచ్చు అంతటన్

శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తిః :— 20—01—2018;  శనివారము. సాహిత్యము—సౌహిత్యము~37. ఈ సారి, సహజకవి శ్రీ చోట్నీరు శ్రీరామమూర్తివర్యుల సమస్యాపూరణ సామర్థ్య ఘనతని గమనిద్దాం! సమస్య :— “హృదయము చీల్ప రత్నములు, హేమములున్  కనవచ్చు అంతటన్ ” || “ఎదని చీల్చి చూస్తే, అంతా మణులూ, బంగారాలూ కంటపడతాయి” అని...

2

సాహిత్యము-సౌహిత్యము – 36 : తల్లికి ముక్కు కోసి, పినతల్లికి కమ్మలొసంగ నేర్తురే

శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తిః | 13—01—2018; శనివారము. “సాహిత్యము—సౌహిత్యము~36.” 16—09—2017; శనివారం, మన ఈ శీర్షిక ఐన “సాహిత్యము—సౌహిత్యము~19″లో శ్రీ కోడూరి సాంబశివరావుగారి గొప్ప సమస్యాపూరణం పరికించేం! ఆ నాటి సమస్య:— “కరములు ఐదు పుత్రునకు, కన్నులు మూడును వాని తండ్రికిన్ “|| గణపతికి, శంకరభగవానునికి అన్వయించి,...