Category: శారదా సంతతి

3

శారదా సంతతి — 14 : పండిత్ భీమసేన్ జోషి

శ్రీశారదా దయా సుధ:— 15—10—2017; ఆదిత్యవారము శారదా సంతతి~14. శారదా ప్రియ సుతుడు~  పండిత్ భీమసేన్ జోషి. పండిత్ భీమసేన్ జోషి కర్ణాటకరాష్ట్రంలోని, ధార్వాడ జిల్లాలో వున్న గదగ్ లో 4—02—1922 తేదీన జన్మించేరు. తండ్రి ఆంగ్ల,కన్నడభాషలలో పండితుడు. తల్లి భజనలు ౘక్కగాపాడే ఆదర్శగృహిణి. చిన్నతనంనుంచి భీమసేన్ చాలాబాగా పాడేవాడు. ఆయన...

3

శారదా సంతతి — 13 : శ్రీ బాలాంత్రపు వేంకటరావు వర్యులు

శ్రీశారదా దయా సుధ :— 08—10—2017; ఆదిత్యవారము. శారదా సంతతి—13. శారదా ప్రియ తనయులు— కవిరాజహంస, కవికులాలంకార శ్రీ బాలాంత్రపు వేంకటరావు వర్యులు. 20వ శతాబ్దం ప్రారంభంలో ఆంధ్రశారదని తమ ఉత్తమశ్రేణి కవిత్వంతోను, నవలలతోను, నాటక సాహిత్యంతోను అపూర్వవైభవంతో అలంకరించి, అర్చించి తెలుగు పాఠకుల పఠన సంస్కృతి ప్రమాణాలని...

6

శారదా సంతతి — 12 : శ్రీ చాగంటి శేషయ్యమహోదయులు

శ్రీశారదా కారుణ్య కామధేనువు :— 01—10—2017; ఆదివారం శారదా సంతతి — 12. శారదాప్రియతనయుడు — శ్రీ చాగంటి శేషయ్యమహోదయులు. తెలుగు సాహిత్యంతో గాఢసాన్నిహిత్యం కలిగినవారందరికి “ఆంధ్రకవితరంగిణి” తో అంతో-ఇంతో స్నేహం-అంటే companionship- ఉండడం అరుదైన విషయం కాదు. ఈ మహాగ్రంథ రచయిత శ్రీ చాగంటి శేషయ్యగారు....

2

శారదా సంతతి — 11 : శ్రీ కాసుల పురుషోత్తమకవి

శ్రీశారదా కారుణ్య కామధేనువు :— 24—09—2017; ఆదిత్యవారము. శారదా సంతతి — 11. అచ్యుతవరలబ్ధకవితా విదగ్ధుడు — ఆంధ్రనాయకశతక కర్త శ్రీ కాసుల పురుషోత్తమకవివరుడు. ఈ శారదాతనయుడు ఆంధ్రశతక సారస్వతచరిత్రలోనే శాశ్వత నిరుపమ స్థానాన్ని సంపాదించుకున్న అకళంక, అపూర్వ పుణ్యమయ గ్రంథరచయిత. వీరి రచనలగురించి విశ్వనాథ సత్యనారాయణగారు...

1

శారదా సంతతి — 10 : భవభూతి మహాకవి

శ్రీశారదా కారుణ్య కౌముదీ :— 17—09—2017; ఆదివారము. శారదా సంతతి — 10 : భవ్య దృశ్య కావ్య రససిద్ధుడు— భవభూతి మహాకవి:— సంస్కృత మహాకవుల ఘనసంప్రదాయ పరంపరలో వాల్మీకి, వ్యాసుడు, కాళిదాసు, బాణుడు, దండి, భాసుడు, మొదలైన అద్భుత శారదా సంతతిలో ఒక దివ్యకర్పూరకళిక భవభూతి...

3

శారదా సంతతి — 9 : శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లుగారు

శ్రీశారదా కారుణ్య కౌముదీ  :— 10—09—2017; ఆదివారం. శారదా సంతతి—9. సంపూర్ణ గానకళాయోగి— శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లుగారు. మొట్టమొదటిసారి ఓలేటివారి ప్రత్యక్షగానాన్ని నేను 1974 చెన్నై సంగీత ఉత్సవంలో మ్యూజిక్ అకాడమీలో విన్నాను. ఆ రోజు ఆడిటోరియం సంగీతరసికులతో నిండిపోయింది. అందువలన నేను వేదికమీద మఠం వేసుకుని కూర్చోడానికి...

4

శారదా సంతతి — 8 : రబియా

శ్రీశారదా కారుణ్య కౌముదీ :— 03—09—2017; ఆదివారం. శారదా సంతతి—8. సూఫీ యోగిని “రబియా“. రబియా ఇస్లాంమతవిభాగమైన “సూఫీ”తత్త్వమార్గంలో పయనించి, సాధకలోకానికి దైవాన్ని చేరుకోవడానికి క్రొత్తదారులు చూపిన మొదటితరం సూఫీవేదాంతులకి చెందిన ఉత్కృష్ట యోగిని. ఆమెఎక్కడ, ఎప్పుడు పుట్టిందో ఖచ్చితంగా తెలియదు. గర్భదారిద్ర్యంలో పుట్టింది. అక్క-చెల్లెళ్ళలో ఆమెనాలుగవది....

2

శారదా సంతతి — 7 : వేములవాడ భీమకవివర్యుడు

శ్రీశారదా కారుణ్య కౌముదీ  :— 27—08—2017; ఆదివారం. శారదా సంతతి—7. దక్షారామ భీమేశ్వర వరపుత్రుడు— వేములవాడ భీమకవివర్యుడు:— నేను నాగపూర్ లో ౘదువుకునే రోజులలో కడియం గ్రామానికిచెందిన భూస్వామి శ్రీ శేషగిరిరావుగారు నాకు మిత్రులయ్యేరు. వారు డా. రావూరి దొరసామిశర్మగారు రచించిన “తెలుగులో తిట్టు కవిత్వము” పుస్తకం...

2

శారదా సంతతి — 6 : శ్రీ యామునాచార్యవర్యులు : రెండవభాగం

శ్రీశారదా వాత్సల్య దీప్తిః :— 20—08—2017; ఆదివారము. శారదా సంతతి—6—రెండవభాగం. శ్రీ యామునాచార్యవర్యులు—2. రాజలాంఛనాలతో, పండితమర్యాదలతో యామునాచార్యుడిని ఆహ్వానించి రాజసభలో విద్వజ్జనకోలాహలుడికి ఎదురుగా తగిన సువర్ణమయ ఆసనంలో కూర్చుండబెట్టేరు. యామునాచార్యుడు 12 ఏళ్ళ వయస్సువాడైనా శారదానుగ్రహ ముఖతేజస్సుతో మణిదీపంలాగ వెలిగిపోతున్నాడు. రాజుగారికి విద్వజ్జనకోలాహలుడి పాండిత్యంమీద నమ్మకంఎక్కువ. అతడు...

3

శారదా సంతతి — 6 : శ్రీ యామునాచార్యవర్యులు

శ్రీశారదా దయా దీప్తిః :— 13—08—2017;  ఆదివారం. శారదా సంతతి—6. శ్రీ యామునాచార్యవర్యులు. అది క్రీ.శ. 1150 వ సంవత్సరప్రాంతం. పాండ్యరాజులు దక్షిణభారతంలోని సువిశాలప్రదేశాన్ని శ్రీమీనాక్షీదేవి అనుగ్రహంతోనిండిన మదురైమహానగరాన్ని ముఖ్యపట్టణంగా చేసుకుని ఒకరాజుగారు పరిపాలిస్తున్నారు. దేశమంతా సుభిక్షంగావుంది. కవులు, కళాకారులు, విద్వాంసులు, వివిధవిద్యావంతులు, గురుకులాలు, పండితపరిషత్తులు అన్నీ ౘక్కగా పోషింపబడుతున్న...