Fun facts – 12
09—09—2017; శనివారం.
వాస్తవాలు-వినోదాలు/Fun-Facts-
1. జే ఓ’ర్ బెర్గ్ (Jay Ohrberg) అమెరికాలోని కాలిఫోర్నియాలో, “అమెరికన్ డ్రీంకార్ “గా చరిత్రకెక్కిన 60 అడుగుల పొడవున్న కారుని తయారుచేసేడట. అది కస్టం-బిల్ట్ “కాడిలాక్ ” లైమోజిన్ . దానికి 16 చక్రాలు. దాని ప్రత్యేకతలు:- 1.ఈత కొలను- అంటే స్విమ్మింగ్ పూల్ . 2. హాట్ టబ్ . 3. హెలికాప్టర్ పాడ్ . 4. శాటిలైట్ డిష్ . 5. క్రిస్టల్ షాండిలైర్ . 6. షేక్ గారికి వారి బేగంలకి సంబంధించిన లగేజిని భద్రపరచుకోవడానికి తగినంత స్థలం.ఇన్ని అసాధారణ ఆకర్షణలూ వున్నా ఆ వాహనానికివున్న ఒకేఒక లోపం “పార్కింగ్ ప్లేస్ ” !!!!!
2. 1932 లో లాస్ ఏంజిలిస్ లో జరిగిన ఒలింపిక్స్ లో స్త్రీల 100 మీటర్ల పరుగుపందెంలో పోలెండుకి చెందిన Stanislawa Walasiewicz అనే మహిళ బంగారుపతకం సాధించింది. తరవాత ఆమె అమెరికా పౌరసత్వం తీసుకుని స్టెల్లా వాల్ష్ గా పేరు మార్చుకుని అమెరికాలోనే స్థిరపడింది. 1980 లో క్లీవ్ లేండ్ లో ఆమె షాపింగుకి వెళ్ళింది. ఆ సమయంలో అక్కడ పోలీసులకి- బందిపోటులకి మధ్య కాల్పులు అంటే క్రాస్ ఫైరింగ్ జరిగింది. ఆ కాల్పులలో చిక్కుకుని ప్రమాదవశాత్తు స్టెల్లా వాల్ష్ మరణించింది. పోస్ట్ మార్టంలో ఆమె పురుష గుహ్యాంగాలు కలిగివుందని వెల్లడి ఐంది.
3. మేరీ పిక్ఫోర్డ్ (Mary Pickford) 1920 లలో “క్వీన్ ఆఫ్ హాలీవుడ్ “గా పేరుపొందింది. కాని ఆమె ఐదు అడుగుల ఎత్తు మాత్రమేవుండేది. అందువల్ల ఆమె తనఎత్తుకితగినట్టు చిన్న అమ్మాయిల పాత్రలలోనే నటించేది. ఆమెని ఇంకా చిన్నదానిగా చూపించడానికి స్టూడియో ద్వారాలనీ,కిటికీలని, ఫర్నిచర్ని మొదలైనవాటిని వాటి సామాన్యపరిమాణంకన్న 1/3 వ వంతు ఎక్కువ పెద్దవిగావుండేలాగ నిర్మించేవారట!
స్వస్తి||
ఈ వినోదాలన్నీ వాస్తవాలే కనక విజ్ఞానవంతంగా ఉన్నాయి. 1932 లో కనక ‘ఆమె’ రహస్యం అంతకాలం దాగుంది. ఇలాంటి అనుభవాల వల్లే, ఈ కాలంలో ఆటగాళ్ళకి ముందే అన్ని పరీక్షలూ జరుపుతున్నారు.