కదంబకం — 24 : ఠుమ్రీగానం
శ్రీశారదా దయా సుధ :—
10—12—2017; ఆదిత్యవారము.
కదంబకం—24.
ఈ రోజు “శారదా సంతతి—22″లో ఠుమ్రీ గానంలో మకుటంలేని మహారాజు ఉస్తాద్ మజుద్దీన్ ఖాన్ సాహబ్ గారిగురించి కొన్ని విషయాలు-విశేషాలు తెలుసుకున్నాం! ఇప్పుడు మరిన్ని ప్రత్యేకాంశాలు మననం చేసుకుందాం!
ప్రాచార్యవర్యులు శ్రీ డి.పి. ముఖర్జీగారు వారి గ్రంథంలో మజుద్దీన్ ఖాన్జీ ఠుమ్రీగానశైలిని ప్రశంసిస్తూ ఈ విధంగా వ్రాసేరు:
“భైరవి రాగంలోని సుప్రసిద్ధ ఠుమ్రీ, “బాజూ బందుఖులు-ఖులు జాయె” ని, విశ్వవిఖ్యాత ఆగ్రా ఘరానా గాయకులు, ఉస్తాద్ ఫైయాజ్ ఖాన్ సాహెబ్ , గంటన్నరసేపు పాడి, రెండువేలమంది రసికులున్న సభని ఒకసందర్భంలో రసానందమగ్నం చేసేరు. ఐనప్పటికీ మౌజుద్దీన్ ఖాన్ పాడిన అదే ఠుమ్రీ, సుకుమారశైలిలోను, వ్యక్తీకరణ మార్దవగుణంలోను, అనూహ్య సూక్ష్శసంగీతాంశ ప్రయోగ నైపుణ్యంలోను ఠుమ్రీగాన సార స్వరూపాన్ని, రసజ్ఞుల హృదయాంతరాళాలని స్పృశించి, సమ్మోహితులని చెయ్యడంలో లోకోత్తరమైనది, అనుపమానమైనది, అనితరసాధ్యమైనదీను! ఆ తరవాత అనేక మహా కళాకారుల ఠుమ్రీ గానాన్ని విన్నాను. కాని వారెవరూ ఠుమ్రీగానకళలో “అగ్రగణ్యులు” కారు.”
మహాగాయకుడు, నాటకరంగ-చలనచిత్ర నటుడు, సంగీతదర్శకుడు, గొప్ప హార్మోనియం-వాదకుడు, సంగీత గ్రంథ రచయిత, విమర్శకుడు ఐన శ్రీ గోవిందరావు తెంబే, తమ మాతృభాష, మరాఠీలో రచించిన, “మాఝే సంగీత వ్యాసంగ్ “, గ్రంథంలోయిలా అన్నారు:
“నేను నా జీవితంలోవిన్న ఠుమ్రీ గాయకులందరిలోను మజుద్దీన్ ఖాన్ సాహబ్ ఉచ్చస్థాయికి చెందినవారు”..
ఆ కాలంలో ఠుమ్రీగానంలో, హైదర్ జాన్ , మల్కాజాన్ , గౌహర్జాన్ , జానకీబాయి, అచ్చన్ బాయి, జోహ్రాబాయి(ఆగ్రా), విద్యాధరీబాయి, జద్దన్ బాయి(విశ్వవిఖ్యాత హిందీ చలనచిత్ర కథానాయిక-“నర్గిస్ ” మాతృమూర్తి) వంటి గొప్ప గానకళామూర్ధన్యస్త్రీమూర్తులు, ఠుమ్రీ గాన సామ్రాజ్యాన్ని, మకుటంలేని మహారాణులుగా ఏలుతున్న స్త్రీ గాయనీమణుల మహాక్షేత్రంలోకి అడుగుపెట్టి, ఔననిపించుకున్న ఏకైక రారాజు ఉస్తాద్ మజుద్దీన్ ఖాన్జీ. మజుద్దీన్ ఖాన్జీ, వారి గురువు భైయా సాహబ్జీ, “వేశ్యల గాన విషయం” గా చులకనగా చూడబడుతున్న ఠుమ్రీకి, కళాకారులలోను, రసజ్ఞలోకంలోను, సభాపూజ్యత తీసుకువచ్చిన మహానుభావులుగా చరిత్రలో పరిగణించబడుతున్నారు.
ఉస్తాద్ మజుద్దీన్ ఖాన్జీ 1904—1908 ప్రాంతాలలో పాడిన అద్భుతమైన ఖయాల్ సంగీతం, ఠుమ్రీలు HMV వారి “Chairman’s Choice—Great Memories” Seriesలో విడుదల చేసిన కేసెట్ లో భద్రపరిచి, 1994లో విడుదల చేసేరు. ఆ టేపులో తోడిరాగంలో ఒక ఖయాలు, సోహినీ, ముల్తానీ, దర్బారీ తోడీ, రాగాలలో కృతులు, భైరవి,పీలూ రాగాలలో ఠుమ్రీలు, దాద్రా,కవ్వాలీ, గజల్ మొదలైన అనేక సంగీతాంశాలు వున్నాయి. అవి వింటే వారి సంగీతంయొక్క ఘనతకొంతైనా మనకి పరిచయం ఔతుంది.
వారి మరణానంతరం, విషాదభరితహృదయంతో మాట్లాడుతూ, ఉస్తాద్ ఫైయాజ్ ఖాన్ సాహబ్(ఆగ్రాఘరానా) యిలా తమ శ్రద్ధాంజలిని తెలియజేసేరు:
“మజుద్దీను ఠుమ్రీగానంకోసమే జన్మించేరు.
ఠుమ్రీగానప్రక్రియ మజుద్దీనుకోసమే పుట్టింది”!
స్వస్తి||
Thank you very much Annayya for infusing me with such a vast and great information hither to unknown to me. I am feeling very happy to know the facts about great musicians. I am too small a person either to comment on the greatness of postings or treasure of your knowledge and feeling proud and fortunate to be one among your cousins.
Raaji tammudu!
This shows the quality of the sensitivity-standard of
Ur aesthetic appreciation in fine arts like Indian
Classical music & the lives of musicians and so on.
I’m equally fortunate, if not more, to have a kid-bro
like U.
like U.
లలిత శాస్త్రీయ సంగీతమైన ఠుమ్రీ గానానికి సంపూర్ణ శాస్త్రీయ సంగీత
స్థాయినీ, గౌరవాన్ని తెచ్చిపెట్టిన ఉస్తాద్ మజుద్దీన్ ఖాన్ గాన
వైశిష్ట్యాన్ని ముచ్చటిస్తూ, సంగీత శాస్త్ర విషయాలూ, వారు ఆలపించిన రాగాల విశేషాలు జోడించి చెప్పిన ఈ కదంబకం రంగుల చిత్రంలా ఉంది.
హిందుస్తానీ సంగీత శాస్త్ర వైభవాన్ని చాటి చెప్పిన ఇలాంటి మహోన్నత
కళాకారుల జీవన గ్రంథం లోంచి కొన్ని పుటలను అందిస్తోన్న నీకు థాంక్స్.