సాహిత్యము-సౌహిత్యము – 38 : సారా తెమ్మనె రాఘవుండు హనుమన్ సంరంభమేపారగన్
శ్రీశారదా వాత్సల్య దీపికా | “సాహిత్యము—సౌహిత్యము~38. 27—01—02018; శనివారము. ఈ వారంకూడా శ్రీ బేతవోలు రామబ్రహ్మవర్యుల అనుపమాన సమస్యాపూరణ ధౌరంధర్యాన్ని, మరొకమారు ౘవిచూద్దాము! సమస్య:— “సారా తెమ్మనె రాఘవుండు హనుమన్ సంరంభమేపారగన్ ” “శ్రీరాముడు మంచి హడావుడిగా, ఆంజనేయుడిని ‘సారా’ అంటే తెలుగు గ్రామ్యభాషలో, మత్తుపానీయం, తీసుకురమ్మన్నాడు”...