శారదా సంతతి — 46 : శ్రీకృష్ణాంశ సంభూత వైణ(వి)కుడు(Flutist)~శ్రీ శరభశాస్త్రిగళ్
ఐం శ్రీశారదాపరదేవతాయై నమోనమః| 03—06—2018; ఆదిత్యవాసరము| శ్రీశారదాంబికా దయాచంద్రికా| “శారదా సంతతి ~ 46” – శ్రీకృష్ణాంశ సంభూత వైణ(వి)కుడు(Flutist)~శ్రీ శరభశాస్త్రిగళ్ (1872-1904)| వేణుగానానికి, దక్షిణభారత శాస్త్రీయ సంగీతలోకంలో, ప్రత్యేకప్రతిపత్తినిచ్చే సభాగౌరవాన్ని ప్రప్రథమంగా కలిగించిన కారణజన్ములు శ్రీ శరభశాస్త్రివరిష్ఠులు. ఉత్తరభారత శాస్త్రీయ సంగీతప్రపంచంలో, వేణువుకి ఏకైకవాద్యసభాపూజ్యతని, శ్రీ...