సాహిత్యము-సౌహిత్యము – 51 : జగద్వ్యాప్తములయ్యె ఇరులు ఖరకరుడుండన్
ఐం శ్రీశారదా పరదేవతాయై నమః| 28—04—2018; శనివారము| శ్రీశారదా వాత్సల్య జ్యోత్స్నా| సాహిత్యము—సౌహిత్యము~51| ఈ వారంకూడా రాజశేఖర-వేంకటశేషకవుల “అవధాన సారము” లోని మరొక విలక్షణ సమస్యాపూరణాన్ని తిలకించి పులకిత మనస్కులమౌదాం! ఇప్పుడు సమస్యని పరిశీలిద్దాం! “జగద్వ్యాప్తములయ్యె ఇరులు ఖరకరుడుండన్ “|| సమస్యని చూచీచూడగానే ఏ ఛందస్సో తెలియదు....