సంగీతం—నాదవేదం—17
24—10—2020; శనివారము. 20-వ మేళకర్త/జనకరాగం నుండి ఆవిర్భవించిన రాగమైన భైరవి ని సాక్షాత్తూ సకలాలంకార సుశోభిత భైరవీదేవతామాత యొక్క అపురూపమైన అందౘందాలని వ్యక్తం చేసే మహామహిమాన్వితరాగం అని అభివర్ణించవలసినదే! అందువలననే దక్షిణభారత సంగీత మూర్తిత్రయం అంటే త్యాగరాజస్వామి, ముద్దు(త్తు)స్వామి దీక్షితులు,శ్యామాశాస్త్రులవారు ముగ్గురూ వివిధ విలక్షణ సుసజ్జిత సంగీతకృతులని...