సంగీతం—నాదవేదం—61
28—08—2021; శనివారం. ॐ 40వ మేళకర్త పేరు “నవనీత(ం) రాగం”. ఈ రాగంలో “ర-గ-ధి-ని” స్వరసంపుటి ఉంటుంది. “సంపూర్ణ—సంపూర్ణ” రాగం అయిన నవనీతంలో పూర్తి స్వరవిన్యాసం ఈ దిగువ ఉదహరింపబడిన రీతిలో ఉంటుంది:— మంద్రస్థాయి షడ్జం-శుద్ధ రిషభం-శుద్ధ గాంధారం-ప్రతి మధ్యమం-పంచమం-చతుశ్శ్రుతి ధైవతం- కైశికి నిషాదం-తారాస్థాయి షడ్జం. త్యాగయ్యగారు...