సంగీతం—నాదవేదం—7
15—08—2020; శనివారం. భారతీయ శాస్త్రీయ సంగీతం లేక ప్రౌఢసంగీతం రంగంలోకి ప్రవేశించి రాగవిభాగం లో సంచరిస్తున్నాం. దక్షిణభారత సంగీత సంప్రదాయాన్ని అనుసరించి వర్తమానకాలంలో మేళకర్తరాగపద్ధతి బాగా ప్రాచుర్యంలో ఉంది. ఈ మేళకర్తరాగాలు 72 రాగాలుగా గుర్తించబడ్డాయి. ఇవి జనకరాగాలు అని లోకంలో ప్రశస్తిని పొందేయి. ఈ జనక...