సాహిత్యము—సౌహిత్యము ~ 71 | భక్తియోగమార్గము—మంత్ర ఉపాసనా ఆవశ్యకత
ఐంశ్రీశారదా పరదేవతాయై నమో నమః| 22—09—2018; శనివారము| “శ్రీశారదాంబికా దయాచంద్రికా”| “సాహిత్యము—సౌహిత్యము ~71″| “భక్తియోగమార్గము—మంత్ర ఉపాసనా ఆవశ్యకత”| భగవానుడు సర్వాంతర్యామిగాను, సర్వవ్యాపకుడిగాను సదా ఉన్నాడని పెద్దలు చెపుతున్నారుకదా! ఇంక అటువంటప్పుడు ఈ ఇష్టదేవతలు, ఈ పూజలూ, జపాలూ, పర్వదినాలలో ప్రత్యేక అర్చనలు, నిత్య – నైమిత్తిక ఆరాధనలు...