Saaradaa Bhaarati Blog

0

సంగీతం—నాదవేదం—12

19—09—2020; శనివారం. ధక్షిణభారత శాస్త్రీయసంగీతవిద్యలో 72~మేళకర్తరాగాలు వివరించ బడినాయి అని తెలుసుకున్నాం. అంతేకాక, స—మ—ప లని మినహాయించి మిగిలిన రిషభం—గాంధారం ధైవతం—నిషాదం స్వరాలలోని మార్పులవలన శుద్ధమధ్యమంతో 36 మేళకర్త రాగాలు, అదే పద్ధతిలో ప్రతిమధ్యమంతో మరొక 36 మేళకర్త రాగాలు, ఆ పైన, రెండూ కలిపి 72...

0

సంగీతం—నాదవేదం—11

12—09—2020; శనివారం. సంస్కృత శాస్త్ర సారస్వతంలో “కటపయాది సంజ్ఞ” వంటి అనేక సాంకేతిక అంశాలు మనం తెలుసుకోవలసినవి ఉన్నాయి. వీటియొక్క పరిచయగాఢత, వీటిగురించిన మన అవగాహనాగాంభీర్యం ఏ స్థాయిలో ఉంటే, అదే స్థాయిలో మనం అధ్యయనం చేసే భారతీయ ప్రాచీన శాస్త్రాల గురించి మనకి కలిగే జ్ఞానంయొక్క...

0

సంగీతం—నాదవేదం—10

05—09—2020; శనివారం. క్రితం వారం ఆరేసి రాగాలని కలిపి ఒకచక్రం(ఒక తరగతికి చెందిన రాగాలు) గా ఏర్పరచడం జరిగిందని తెలుసుకున్నాం. మనం చూసిన స్వరాల కూర్పులు ఆరేసి ఉన్నాయి కనకే ఆరేసి రాగాలు కలిసి ఒక చక్రంగా ఏర్పరచడం జరిగింది. ప్రతి మేళకర్త రాగానికి తప్పనిసరిగా ఉండే...

0

సంగీతం—నాదవేదం—9

29—08—2020; శనివారం. క్రితం వారం క-ట-ప-యాది సంజ్ఞ గురించి చర్చించుకున్నాం. ఆ పై వారం, అంటే సంగీతం-నాదవేదం—7 లో మూడు రిషభాలు, మూడు గాంధారాలు, మూడు ధైవతాలు, మూడు నిషాదాలు గురించి తెలుసుకున్నాం. వాటి పరిభాషని కూడా పరిచయం చేసుకున్నాం. మూడేసి స్వరాల రూపాలు ర—రి—రు; గ—గి—గు;...

0

సంగీతం—నాదవేదం—8

22—08—2020; శనివారం. ముందుగా గంగా—కావేరీ సముదాయ సభ్యులందరికి సకుటుంబ హార్దిక వినాయకచతుర్థి శుభాకాంక్షలు సమర్పించుకుంటున్నాము. యోగ క్షేమ ప్రదుడగునాగాస్యుని ౘవితి రోజు నైజాశీస్సుల్|భోగాదిక రూపములోబాగుగ మీకెల్ల స్వాస్థ్య భాగ్యమునిచ్చున్|| మనం క్రితం వారం 72 మేళకర్తరాగాలు కి సంబంధించిన ఆ రాగాల పేర్లు,వాటికి సంబంధించిన ప్రణాళికలు మొదలైన...

0

సంగీతం—నాదవేదం—7

15—08—2020; శనివారం. భారతీయ శాస్త్రీయ సంగీతం లేక ప్రౌఢసంగీతం రంగంలోకి ప్రవేశించి రాగవిభాగం లో సంచరిస్తున్నాం. దక్షిణభారత సంగీత సంప్రదాయాన్ని అనుసరించి వర్తమానకాలంలో మేళకర్తరాగపద్ధతి బాగా ప్రాచుర్యంలో ఉంది. ఈ మేళకర్తరాగాలు 72 రాగాలుగా గుర్తించబడ్డాయి. ఇవి జనకరాగాలు అని లోకంలో ప్రశస్తిని పొందేయి. ఈ జనక...

0

సంగీతం—నాదవేదం—6

08—08—2020; శనివారం. కేవలం ఒకే ఒక్క స్వరం ఎంత మధురమైన గళంలోనుండి విన్నా, లేక వీణ, వేణువు వంటి నాదపూర్ణమైన సంగీతవాద్యంనుండి విన్నా ఆ ఒక్క స్వరమే మనకి నిరంతర ఆహ్లాదకరమైన సంగీతం కాలేదు. కొన్ని స్వరాల సముదాయం మాత్రమే మనం సంగీతం అని భావించే నాదప్రక్రియకి...

0

సంగీతం—నాదవేదం—5

01-08-2020; శనివారం. మనం ఈ శీర్షిక మొదటిభాగంలో సంగీతవిద్య కి సంబంధించిన సప్తస్వరాలు గురించి పరిచయం చేసుకున్నాం. వీటిని Musical Alphabet అంటారనికూడా తెలుసుకున్నాం. సంగీతవిద్యాకారులైన నాదశాస్త్రవేత్తలు పరమేశ్వరుడు సృజించిన ప్రకృతి లోని పశుపక్ష్యాదుల కంఠస్వరాలలో సూక్ష్మరూపంలో నిక్షిప్తం చేయబడిన వివిధ విలక్షణ శబ్దాలనుండి ఈ మనోరంజకమైన...

0

సంగీతం—నాదవేదం—4

25-07-2020; శనివారం. మూడువారాలనుండి కేవలం సంగీతశాస్త్రం పరిధిని అనుసరించి శాస్త్రవిషయాలని జాగ్రత్తగాఅధ్యయనం చేయడంలో తలమునకలుగా ఉన్నాం. సాంకేతికవిషయవివరణలో పాలుపంచుకున్నాం. మెదడుకి తగినంత బలవర్ధక ఆహారం ఔషధప్రాయంగా అందించడానికి ప్రయత్నించేం. ఈ వారం కాస్తంత విరామం తీసుకుని మన సంగీత విద్యకి దోహదకరమైన వేడుకని కలిగించే మంచి పసందైన...

0

సంగీతం—నాదవేదం—3

18—07—2020; శనివారం. “వేదం“:— సంగీతానికి ప్రాచీన భారతదేశంలో “గాంధర్వవేదం” అనే పేరు బాగా ప్రచార-వ్యవహారాలలో ఉండేది. గాంధర్వం అనబడే విద్యాశాస్త్రం శ్రీ దత్తిలాచార్యుల వారిచేత ఈ విధంగా నిర్వచించబడింది. పదస్య స్వరసంఘాతః తాలే(ళే)న సంగతః తథా|ప్రయుక్తః చావధానేన గాన్ధర్వం అభిధీయతే|| “స్వరసహితపదం తాళానికి అనుగుణంగా కూర్చబడి, శ్రద్ధాత్మకమైన...