సాహిత్యము సౌహిత్యము – 7: సీసపద్యం – 3 – పనసపండుమాటల ఆట
శ్రీశారదా దయా దీప్తిః :— 24-06-2017, శనివారం. ఈ వారాంత సాహిత్యక్రీడ సీసపద్యంలోనే మరొక విధమైన వినోదమూ, విజ్ఞానమూ కలిగించే ౘక్కని ఆట. ముందుగా పద్యం తెలుసుకుందాం! “ఆద్యంత మధ్యమాంతాదివర్ణంబుల తేటి, రక్కసిరాజు, తెలియ తల్లి; ఆద్యంతమధ్యమాంతాదివర్ణంబుల శివునిల్లు, వరిచేను, క్షీరధార; ఆద్యంతమధ్యమాంతాదివర్ణంబుల భార్యయు, ఖడ్గంబు, పాదపంబు...