Saaradaa Bhaarati Blog

1

సాహిత్యము సౌహిత్యము – 12 : గరుడుడు గణపతికి తండ్రి కావలె సుమ్మీ

శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తిః :— 29—07—2017; శనివారము. సాహిత్యము—సౌహిత్యము. ఈ రోజు కొప్పరపు సోదరకవులకి ఒక అవధానంలో ఇవ్వబడిన ఒక జటిలసమస్యని మహాప్రతిభావంతులైన ఆ సోదరకవులు ఎంతబాగా పూరించేరో గ్రహించి ఆనందిద్దాం! సమస్య కందపద్యపాదం. కందం చిన్నపద్యాలకోవకి చెందినదని మనకి తెలుసు. ఇంతకీ సమస్య యిది:— “గరుడుడు గణపతికి తండ్రి కావలె సుమ్మీ“! అర్థం తేటతెల్లంగానేవుంది. గరుత్మంతుడు...

0

Fun facts – 6

వాస్తవాలు—వినోదాలు—6. 29—07—2017; శనివారము. 1. 1961లో ఇండోనీషియాలోని ఇంద్రమయునగరం అలవిమీరిన ఎలుకలబెడదతో తల్లడిల్లిపోయింది. ఈ బెడదని నిరోధింౘడానికి సతమతమౌతున్న స్థానికప్రభుత్వం ఒక విచిత్రమైన ప్రణాళికని ప్రవేశ పెట్టడానికి ఆలోచన చేసిందట. వివాహంకోసం ప్రభుత్వం అనుమతిని మంజూరుచెయ్యాలంటే దరఖాస్తు దారులు ప్రభుత్వాధికారికి 25 ఎలుకతోకలు సమర్పించుకోవాలట. ఆదేశంలో అది జరిగిందో లేదో తెలియదుకాని, అదే మనదేశంలో ఐతే నకిలీ ఎలుకతోకలవ్యాపారం 30...

2

శతమానమ్

శతమానమ్ : శుక్లయజుర్వేదాంతర్గతమైన వాజసనేయసంహిత(19–93)లో “ఇంద్రస్య రూపం శతమానం—” అని వర్ణన ఉంది. ఈ “శతమానం” అనే పదబంధానికి మహీధరభాష్యం యీ విధంగా వివరణనిచ్చింది: “శతానాం ఏకేషాం ప్రాణినాం ‘మానం’, పూజా యస్మిన్ తత్ –జగత్ పూజ్యం ఇతి అర్థః“| అంటే వందలకొద్దీ ఉన్నవారిలో (దేవతలలో) ప్రత్యేక గౌరవనీయుడు...

0

శ్రీ శిక్షాష్టకమ్ – మొదటి శ్లోకం

శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తిః (21-5-17): ఇప్పుడు శ్రీమాత వ్రాయించబోయే విషయం మన డా.శ్రీనివాస్ కి అత్యంతప్రియవిషయం. వెళ్ళినపుడల్లా మళ్ళీమళ్ళీ తనకి తెలిసినదే ఐనా అంతే! శ్రీకృష్ణచైతన్యమహాప్రభువులు “శ్రీ శిక్షాష్టకమ్ ” అనే ఒక పరమరమ్యమైన అష్టకం ఒక్కటే రచించారు. అది సర్వవేదాంత తత్త్వసారం. తిక్కనగారు తమ తెలుగు భారతంలో...

0

Sanaathana Saaradaa – 3: Naada

Sri Saaradaa Dayaa Chandrika–3. 28–07–2017, Friday. The Everlasting Splendours of Sanaatana Saaradaa —3. Having gone through some oral and written doubts expressed by a few ardent spiritual seekers, the domain of Naada which includes (1) Mantra Sastra...

0

శారదా సంతతి – 3 : శ్రీ తిరుక్కోడికావల్ కృష్ణయ్యర్

 శ్రీశారదా దయా చంద్రికా :— 23—7—2017; ఆదివారము.శారదా సంతతి —3. ఈ వారం దక్షిణభారతదేశ కర్ణాటక సంగీతప్రపంచంలో శాశ్వతయశస్సు పొందిన శారదాతనయుడు, గొప్ప వాయులీన విద్వత్కళాకారుడు ఐన శ్రీ తిరుక్కోడికావల్ కృష్ణయ్యర్ గారి అనుపమాన ప్రజ్ఞావిభవం గురించి సంగ్రహంగా తెలుసుకుందాం. శ్రీకృష్ణయ్యరు తంజావూరుజిల్లాలోని మరత్తురైగ్రామంలో 1857 లో జన్మించేరు. తండ్రి కుప్పుస్వామి భాగవతరు హరికథానిర్వహణలో సుప్రసిద్ధులు. ప్రారంభంలో కృష్ణయ్యరు తండ్రివద్ద సంగీతంనేర్చినా,...

0

కదంబకం – 4 : ససంకల్పాత్మక స్వేచ్ఛాయుత ధ్యానం (Volitional free meditation)

శ్రీశారదా వాత్సల్య దీప్తిః :— 23—07—2017;  ఆదివారము. సుమసుందర కదంబకం——4. ఈ వారం ఈ శీర్షికలో ఒక విలక్షణ విషయంగురించి ప్రస్తావించుకుందాం. ఈ సారి ధ్యానంగురించి కొంత తెలుసుకుందాం. ధ్యానం అనేది అనేకరీతులలో ఆచరించడం జరుగుతూవుంటుంది. ససంకల్పాత్మక ఏకవస్తుకృత ధ్యానం (Volitional singularly focussed meditation) ససంకల్పాత్మక స్వేచ్ఛాయుత ధ్యానం (Volitional free meditation)...

0

Fun facts – 5

శ్రీశారదా దయా దీప్తిః :— 22–07–2017; శనివారం; 8–00AM. వాస్తవాలు–వినోదాలు—5. 1. మనం తరచుగా ఆంగ్లంలోని “Gadget” అనేమాటని ఉపయోగిస్తూంటాం. ఈ మాటయొక్క వ్యుత్పత్తి(Etymological derivation) ఎంత అస్పష్టంగా వుంటుందో దీని అర్థంకూడా ఇదమిత్థంగా తేల్చి చెప్పడానికి అంత సందిగ్ధంగానూ వుంటుంది. ఓడలలోని ఉద్యోగులు వారు ఉపయోగించే కొన్ని అప్రధానమైన చిన్న పనిముట్లని ఏ పేరూ...

0

సాహిత్యము సౌహిత్యము – 11 : రాతికి మ్రొక్కగావలయు, రాతికి మ్రొక్కుట నిష్ఫలంబగున్

శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తిః :— 21–07–2017; శనివారం,  6-00AM.ఈ వారం ఒక తెలుగు సమస్యని చూద్దాం! శ్రీ సి.వి. సుబ్బన్నశతావధానిగారు మన కాలానికిచెందిన గొప్ప అవధానులలో ఒకరు. ఆంధ్ర, సంస్కృతాలలో గట్టిపట్టు వున్న ప్రజ్ఞావంతులు.  వారు ఆదిలాబాదులో 3-12-1966 వ తేదీన ఘనంగా నిర్వహించిన “అష్టావధానం”లో ఒక క్లిష్టసమస్య యివ్వబడింది. అది...