Saaradaa Bhaarati Blog

0

సంగీతం—నాదవేదం—52

26—06—2021; శనివారం. ॐ 29వ మేళకర్త అయిన “ధీరశంకరాభరణరాగం” యొక్క జన్యరాగంగా వర్గీకరించబడిన మహామనోహరమైన ఒక గొప్పరాగం “ఆరభి రాగం”. ఇది “ఘనరాగాలు” గా సుప్రసిద్ధమైన రాగాలలో అద్భుతమైన మనోరంజక సంచారాలు కలిగిన మహనీయరాగం. “ఆరభి రాగం” ఔడవ — సంపూర్ణ రాగం. ఆరోహణలో గాంధారం(గ) —...

0

సంగీతం—నాదవేదం—51

19—06—2021; శనివారం. ॐ 29వ మేళకర్త అయిన “ధీరశంకరాభరణరాగం” యొక్క బాగా ప్రచారంలో ఉన్న కొన్ని ప్రధానజన్యరాగాల సంక్షిప్తపరిచయం చేసుకుందాం! మొదటగా “అఠాణ రాగం” పరిచయం చేసుకుందాం! ఇది ఔడవ — వక్ర సంపూర్ణరాగం. గ—ధ స్వరాలు ఆరోహణలో వర్జ్యస్వరాలు. (“గ” వర్జ్యస్వరంగా షాడవ ఆరోహణతో కూడా...

0

సంగీతం—నాదవేదం—50

12—06—2021; శనివారం. ॐ శంకరాభరణం రాగంలో శ్యామాశాస్త్రిగారి రచనల ఎత్తుగడలు ఇప్పుడు పరిచయం చేసుకుందాం:— “దేవి! మీననేత్రి! బ్రోవ — రావె! దయచేయవె! బ్రోవరావమ్మా! ॥దేవి!॥ (ఆదితాళం); సరోజదళనేత్రి! హిమగిరిపుత్రి! నీ పదాంబుజములే — సదా నమ్మినానమ్మా! శుభమిమ్మా! శ్రీమీనాక్షమ్మా! ॥సరోజదళనేత్రి!॥ (ఆదితాళం); నన్ను కరుణించి బ్రోవు...

0

సంగీతం—నాదవేదం—49

05—06—2021; శనివారం ॐ శంకరాభరణ రాగంలో భద్రాచల రామదాసుగారి కీర్తనలు ఇప్పుడు తెలుసుకుందాం:— “ఇతరములెరుగనయ్యా, నా గతి నీవే రామయ్యా! — సతతము సీతాపతి నీవే యని, మతి నమ్మితి, సద్గతి చెందింపుము ॥ఇతరములెరుగనయ్యా॥ (ఏకతాళం); రక్షింపవిది యేమో రాచకార్యము పుట్టె, రామచంద్రా! — నన్ను రక్షింపకున్నను...

0

సంగీతం—నాదవేదం—48

29—05—2021; శనివారము. ॐ త్యాగరాజస్వామివారు 29వ మేళకర్త రాగజన్యమైన శంకరాభరణరాగంలో అనేక లోకోత్తర కృతులని రచంచేరు. వాటి పల్లవిలని ఇప్పుడు పరిచయం చేసుకుందాం:— “ఈవరకు జూచినది చాలదా — యింక నా రీతియా ॥ఈవరకు॥ (ఆదితాళం); ఎదుట నిలిచితే నీదుసొమ్ము లేమి పోవురా? ॥ఎదుట॥ (ఆదితాళం); ఎందు...

0

సంగీతం—నాదవేదం—47

22—05—2021; శనివారము. ॐ 29వ మేళకర్త అయిన “ధీరశంకరాభరణ రాగ జన్యమైన శంకరాభరణరాగం” ఆరోహణలో సప్తస్వరాలు, అవరోహణలో సప్తస్వరాలు కలిగిన “సంపూర్ణ—సంపూర్ణ” రాగం. ఈ రాగంలో — “షడ్జం ~ చతుశ్శ్రుతి రిషభం ~ అన్తర గాంధారం ~ శుద్ధ మధ్యమం ~ పఞ్చమం ~ చతుశ్శ్రుతి...

0

సంగీతం—నాదవేదం—46

15—05—2021; శనివారం. ॐ “నేను పడుతున్న ఆ యాతనని, వేదికపై గానం చేస్తున్న పెద్దాయన గమనించేరు అనుకుంటాను. అంతవరకు సభని అంతటిని, అన్నివైపులనుంచీ చూచే ఆయన తమాషాగా దరహాసంచేస్తూ నా వైపు తదేకంగా చూస్తూ, తాము అప్పటి వరకు పాడుతున్న పాట ఐపోవడంవలన, ఏదో రాగం అందుకుని,...

0

సంగీతం—నాదవేదం—45

8—5—20201; శనివారం ॐ (ఈ వృత్తాంతం జరిగే సమయానికి మా చిన్నాన్నగారికి సుమారు 28 సంవత్సరాల వయస్సు ఉండి ఉంటుందని చెప్పేను కదా! ఇంక, వారిగురించి సంక్షిప్తపరిచయం చేసుకుందాం! వారు కాళిదాసు రచించిన “మేఘసందేశమ్॥” సంస్కృతకావ్యకథకి పూర్వరంగమైన మూలకథని తెలుగులో “హేమమాలి” అనే పద్యకావ్యంగా విరచించి బుధజన...

0

సంగీతం—నాదవేదం—44

01—05—02021; శనివారం ॐ మనం ఐదవది ఐన బాణచక్రం లోని నాలుగవ మేళకర్త అంటే మొత్తంమీద 28వ మేళకర్త ఐన హరికాంభోజిరాగం, ఆ రాగంయొక్క కొన్ని ముఖ్యజన్యరాగాలు గురించి సంక్షిప్త పరిచయం, ఇతర విశేషాలు తెలుసుకున్నాం. ఇప్పుడు బాణచక్రంలోని ఐదవ మేళకర్తరాగం లేక మొత్తంమీద, “కటపయాది సంకేత...

0

సంగీతం—నాదవేదం—43

24—4—2021; శనివారం. ॐ హరికాంభోజికి తరువాయి జన్యరాగం సరస్వతీమనోహరి రాగం. ఈ రాగంలో త్యాగరాజస్వామి “ఎంత వేడుకొందు రాఘవా! ~ పంతమేలరా? ఓ రాఘవా! (దేశాదితాళం)” అనే ఒక కృతిని రచించేరు. దీక్షితస్వామి “సరస్వతీమనోహరి! శంకరి! సదానందలహరి! గౌరి! శంకరి! ॥సరస్వతీమనోహరి॥ (ఆదితాళం)” అనే ఒక కృతిని...