సాహిత్యము-సౌహిత్యము – 23 : గ్రహములు రెండె మానవుని కష్ట సుఖమ్ముల కెల్ల హేతువుల్
శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తిః :— 14—10—2017; శనివారము. సాహిత్యము—సౌహిత్యము~23. ఈ సారి సమస్యాపూరణము చాలా ఉదాత్తస్థాయిలోను, ఉన్నత సందేశ దాయకంగానువుంది. సమస్య సామాన్యమైనదే ఐనా, అసామాన్య భావగరిమతో పూరణం చేస్తే అటువంటి సాధారణసమస్యకూడా అసాధారణ పూర్ణభావవిలసితమైన పద్యంలో భాగమైపోయినందున, బంగారంలో కలిసిపోయిన రాగికి లాగ ఉత్తమ సువర్ణ...