శారదా సంతతి — 18 : మల్లికార్జున మన్సూర్
శ్రీశారదా దయా సుధ:— 12—11—2017; ఆదిత్యవారము. శారదా సంతతి~18. మహా నాద యోగి ~ మల్లికార్జున మన్సూర్ . సద్గురు శ్రీ త్యాగరాజస్వామివారి “నాదతనుమనిశం శంకరం నమామి మే మనసా శిరసా” అనే కృతి బాగా ప్రజాదరణ పొందినది. ఇది 19వ మేళకర్త ఐన “ఝంకారధ్వని” రాగజన్యమైన...