సంగీతం—నాదవేదం—62
04—09—2021; శనివారం. ॐ ఇప్పుడు ఎనిమిదవది అయిన “వసు(అష్టవసువులు)చక్రం” లోని ఆరు రాగాల పరిచయం చేసుకుందాం! ఈ చక్రంలోని మొదటిది, అంటే, 43వ మేళకర్త, “గవాంభోధి రాగం”. దీనిలో “ర-గి-ధ-న” స్వరాలు కీలకమైనవి. “సంపూర్ణ-సంపూర్ణ” రాగం అయిన గవాంభోధిలోని స్వరప్రణాళిక ఈ దిగువ వివరింపబడిన విధంగా ఉంటుంది:—...