సాహిత్యము-సౌహిత్యము – 57 : అభూతిం అసమృద్ధిం చ సర్వాం నిర్ణుద మే గృహాత్
ఐం శ్రీశారదాపరదేవతాయై నమోనమః| 09—06—2018; శనివారము| శ్రీశారదాంబికా దయాచంద్రికా| “సాహిత్యము—సౌహిత్యము~57″| ఈ వారం మానవజాతియొక్క సామాజికస్థితి-గతులని అమానుషంగా శాసిస్తున్న “దారిద్ర్యం” లేక “పేదరికం” గురించిన విషయాలు సంక్షేపంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం! శ్రుతినుంచి ఉద్ధరించబడిన “శ్రీసూక్తమ్ ” లోని, 8వ మంత్రంలో, సాధకుడైన భక్తుడు సర్వసంపదలకి ఆశ్రయస్థానమైన లక్ష్మీదేవితో ఈ...