Category: Saahityamu-Souhityamu

3

సాహిత్యము-సౌహిత్యము – 15 : గుట్టుగ చెప్పికొన్న పలుకుల్ బహిరంగములౌను వెంటనే

శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తిః :— 19—08—2017; శనివారము. సాహిత్యము—సౌహిత్యము- – -15. ఈ వారం సమస్యాపూరణం శ్రీ ఉత్పల సత్యనారాయణాచార్య గారిది. అసమానప్రతిభాసంపన్నులు, కారణజన్ములు, కుర్తాళంపీఠాధిపతులు ఐన శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానందజీమహరాజ్ వారు పూర్వాశ్రమంలో డా. ప్రసాదరాయ కులపతివర్యులు. వారి “కవితా మహేంద్రజాలం” గ్రథంనుంచిసేకరించబడిన పద్యమిది. వారు శ్రీ ఉత్పలవారి...

2

సాహిత్యము-సౌహిత్యము – 14 : దోషాణ్వేషణతత్పరో విజయతే  చోరోపమః సత్కవిః

శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తిః :— 12—08—2017;  శనివారము. సాహిత్యము—సౌహిత్యము——14. ఇంతవరకు తెలుగుసమస్యాపూరణాలు బాగానే చర్చించుకుంటూవస్తున్నాం! ఈసారి ఒక సంస్కృతసమస్యా  పూరణం చూద్దాం! “దోషాణ్వేషణతత్పరో విజయతే చోరోపమః సత్కవిః” || శార్దూలవృత్తంలో ఈ సమస్య యివ్వబడింది. ” లోటుపాట్లు గమనించే దొంగలాగ కవి భాసిస్తున్నాడు ” అని కవిని దొంగతో...

2

సాహిత్యము సౌహిత్యము – 13 : స్మితకున్ వందనమాచరింపుము కవీ!

శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తిః :— 05—08—2017;  శనివారము. సాహిత్యము—సౌహిత్యము–13 ఆచార్య శ్రీ బేతవోలు రామబ్రహ్మంగారు సువిఖ్యాత విద్వత్కవులు, విమర్శకులు, సంభాషణాచతురులు, సభానిర్వహణకుశలులు, సృజనాత్మక అవధానవిద్యాకోవిదులు.ఒకసారి సభలో చలనచిత్రనటి “స్మిత” పేరుతోకూడిన సమస్యనిచ్చి వారిని పూరింౘవలసినదిగా కోరేరుట! ఆ సమస్య యిది:—”స్మితకున్ వందనమాచరింపుము కవీ! సిద్ధించు నీ కోరికల్ “| ఈ సమస్యలో ఎవరికీ...

1

సాహిత్యము సౌహిత్యము – 12 : గరుడుడు గణపతికి తండ్రి కావలె సుమ్మీ

శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తిః :— 29—07—2017; శనివారము. సాహిత్యము—సౌహిత్యము. ఈ రోజు కొప్పరపు సోదరకవులకి ఒక అవధానంలో ఇవ్వబడిన ఒక జటిలసమస్యని మహాప్రతిభావంతులైన ఆ సోదరకవులు ఎంతబాగా పూరించేరో గ్రహించి ఆనందిద్దాం! సమస్య కందపద్యపాదం. కందం చిన్నపద్యాలకోవకి చెందినదని మనకి తెలుసు. ఇంతకీ సమస్య యిది:— “గరుడుడు గణపతికి తండ్రి కావలె సుమ్మీ“! అర్థం తేటతెల్లంగానేవుంది. గరుత్మంతుడు...

0

సాహిత్యము సౌహిత్యము – 11 : రాతికి మ్రొక్కగావలయు, రాతికి మ్రొక్కుట నిష్ఫలంబగున్

శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తిః :— 21–07–2017; శనివారం,  6-00AM.ఈ వారం ఒక తెలుగు సమస్యని చూద్దాం! శ్రీ సి.వి. సుబ్బన్నశతావధానిగారు మన కాలానికిచెందిన గొప్ప అవధానులలో ఒకరు. ఆంధ్ర, సంస్కృతాలలో గట్టిపట్టు వున్న ప్రజ్ఞావంతులు.  వారు ఆదిలాబాదులో 3-12-1966 వ తేదీన ఘనంగా నిర్వహించిన “అష్టావధానం”లో ఒక క్లిష్టసమస్య యివ్వబడింది. అది...

2

సాహిత్యము సౌహిత్యము – 10 : అంభోధిః జలధిః పయోధిరుధధిః వారాన్నిధిర్వారిధిః

శ్రీశారదా వాత్సల్య దీప్తిః :— 14–07–2017,  శనివారం, 6–20AM. ఈ శీర్షికలో యింతవరకు తెలుగు వాఙ్మయంలో ప్రసిద్ధమైన సీసపద్యాలలో వున్న కొన్ని ప్రహేళికలని పరికించి, చర్చించుకుని అంతో-ఇంతో వినోదంతోపాటు, కాస్తంత విషయసేకరణచేసి ముందుకి కొనసాగుతున్నాం! ప్రహేళికల పరంపరని ఈ సామాజిక మాధ్యమ పరిమితులకి లోబడి ఒక్కొక్క రకానికి ఒక ఉదాహరణ రూపంలో...

0

సాహిత్యము సౌహిత్యము – 9 : శ్రీరంగనాయకస్వామీ

శ్రీశారదా వాత్సల్య దీప్తిః :— 08–07–2017; శనివారము. ఈ వారం మరొక రకమైన సీసపద్యం పరిశీలిద్దాం! “పద్మనాభుని ప్రక్క పాయనిదెవ్వరు? దశకంఠుడేదేవ తరుణి కూడె? భాగీరథుండేమి పాటించి తెచ్చెను? భావజ జనకుని పానుపేది? గ్రహరాజసూనుని ఘనమైన పేరేమి? మహిలోన భూపతి మన్ననేమి? ముత్యమేకార్తెలో ముందుజన్మించును? సోమకునేమియై స్వామి...

0

సాహిత్యము సౌహిత్యము – 8: సీసపద్యం – 4 – మూడు మాటలొక్కపదమై కూడుచుండ

శ్రీశారదా వాత్సల్య దీప్తిః :— 01–07–2017; శనివారం.ఈ వారం మరొక సీసపద్యంలోని అందంయొక్క చందం చూద్దాం! “ఏనుగు,సింహంబు,ఎలనాగయునుకూడి ఒకమాటలోపల ఉండవలయు; పక్షియు,వస్త్రంబు,పాషాణమునుకూడి ఒకమాటలోపల ఉండవలయు; ఫణిరాజు,ఫణివైరి,ఫణిభూషణుడుకూడి ఒకమాటలోపల ఉండవలయు; రారాజు,రతిరాజు,రాజరాజునుకూడి ఒకమాటలోపల ఉండవలయు మూడు మాటలొక్కపదమై కూడుచుండ నాల్గు ప్రశ్నలకు జవాబు నాల్గు కలవు చెప్పనేర్చిన వారిల...

0

సాహిత్యము సౌహిత్యము – 7: సీసపద్యం – 3 – పనసపండుమాటల ఆట

శ్రీశారదా దయా దీప్తిః :— 24-06-2017, శనివారం. ఈ వారాంత సాహిత్యక్రీడ సీసపద్యంలోనే మరొక విధమైన వినోదమూ, విజ్ఞానమూ కలిగించే ౘక్కని ఆట. ముందుగా పద్యం తెలుసుకుందాం! “ఆద్యంత మధ్యమాంతాదివర్ణంబుల తేటి, రక్కసిరాజు, తెలియ తల్లి; ఆద్యంతమధ్యమాంతాదివర్ణంబుల శివునిల్లు, వరిచేను, క్షీరధార; ఆద్యంతమధ్యమాంతాదివర్ణంబుల భార్యయు, ఖడ్గంబు, పాదపంబు...

1

సాహిత్యము సౌహిత్యము – 6 : సీసపద్యం – 2

శ్రీశారదా దయా దీప్తిః :— క్రితం వారం ఒక సీసపద్యం ద్వారా కొన్ని మనోరంజకమైన విషయాలు తెలుసుకున్నాం. వినోదమూ, వివేకమూ, విద్య పెంపొందింప చేయడమే ఈ సాహిత్యక్రీడయొక్క ముఖ్య ధ్యేయం. ఈవారం ఇంకొక సీసపద్యం పరిశీలిద్దాం: “రాముడెవ్వరిగూడిరావణుమర్దించె? పరవాసుదేవుని పట్ణమేది? రాజమన్నారుచేరంజిల్లుశరమేది? వెలయ నాలుగువంటివిత్తదేది? సీతనుచేకొన చెరచినధనువేది?...