Category: Saahityamu-Souhityamu

1

సాహిత్యము-సౌహిత్యము – 35 : కుండలు కొండనెత్తె, కనుగొన్న సురల్ వెరగంది చూడగన్

శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తిః : 06—01—2018; శనివారము. సాహిత్యము—సౌహిత్యము~35. 05—08—2017; శనివారం, “సాహిత్యము—సౌహిత్యము~13” లో, సుప్రసిద్ధ కవి, విమర్శకులు, అవధానవిద్యావిశారదులు, సంచాలకులు, పండితులు ఐన శ్రీ బేతవోలు రామబ్రహ్మంగారి గొప్ప సమస్యాపూరణం, “స్మితకున్ వందనమాచరింపుము,కవీ!సిద్ధించు నీ కోరికల్ ” పరిచయం చేసుకుని ఆనందించేం! మళ్ళీ, 2018 లో,మొట్టమొదటి...

2

సాహిత్యము-సౌహిత్యము – 34 : అమవసనాటి వెన్నెలలహా! తలపోయగ అద్భుతం బగున్

శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తిః :— 30—12—2017; శనివారము. సాహిత్యము—సౌహిత్యము~34. శ్రీ అన్నపర్తి సీతారామాంజనేయవర్యుల సమస్యాపూరణ ఘనతని ఈ వారం తెలుసుకుదాం! సమస్య:— “అమవసనాటి వెన్నెలలహా! తలపోయగ అద్భుతం బగున్ ” || “అమావాస్యనాటి వెన్నెలలని తలుచుకుంటే, ఆహా! అద్భుతంగా వుంటుంది”. అని ఈ సమస్యకి అర్థం. అమావాస్య...

2

సాహిత్యము-సౌహిత్యము – 33 : ఇంద్ర పదద్వయంబు కవిసెన్ , కట్టా! అయఃశృంఖలల్

శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తిః :— 23—12—2017; శనివారము. సాహిత్యము—సౌహిత్యము~33. ఈ వారమూ శ్రీ కనుమలూరి వెంకట శివయ్యకవివరుల సమస్యాపూరణమే పరికిద్దాము! “ఇంద్ర పదద్వయంబు కవిసెన్ , కట్టా! అయఃశృంఖలల్ “|| ఇదొక అరుదైన సమస్య. ఇది పద్యపాదం లోని భాగం మాత్రమే! ఈ పాదానికి ముందు ఒక...

2

సాహిత్యము-సౌహిత్యము – 32 : వాలిని పెండ్లియాడె హరిబాణుడు, సర్వజగద్ధితంబుగన్

శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తిః :— 16—12—2017; శనివారము. సాహిత్యము—సౌహిత్యము~32. ఈ వారంకూడా శ్రీ కనుమలూరి వెంకటశివయ్యగారి సమస్యాపూరణమే చూద్దాం. “వాలిని పెండ్లియాడె హరిబాణుడు, సర్వజగద్ధితంబుగన్ ” || హరి అంటే విష్ణువు. బాణుడు అంటే (నర్మద)బాణరూపం కలిగిన శివుడు. వీరిద్దరూకలిసి వాలిని పెళ్ళిచేసుకోవడం, దానివల్ల లోకానికి మేలుకలగడం...

2

సాహిత్యము-సౌహిత్యము – 31 : రాయలు కేలదాల్చె సతి రత్నసమంచిత నూపురమ్ములన్

శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తిః :— 09—12—2017; శనివారము. సాహిత్యము—సౌహిత్యము~31. ఈ రోజు సమస్యాపూరణం శ్రీ కనుమలూరి వెంకట శివయ్య వరేణ్యులు. వారికి యివ్వబడిన సమస్య యిది:— “రాయలు కేలదాల్చె సతి రత్నసమంచిత నూపురమ్ములన్ ” || “శ్రీకృష్ణదేవరాయలువారు, వారి భార్య యొక్క రత్నమయశోభతో నిండిన కాలి అందెలని,...

1

సాహిత్యము-సౌహిత్యము – 30 : అమ్మా! రమ్మని పిల్చె భార్యను, మగం డయ్యర్థరాత్రంబునన్

శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తిః :— 02—12—2017; శనివారము. సాహిత్యము—సౌహిత్యము~30. మన శీర్షిక శ్రీ ప్రతాప సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని వదలలేకపోతోంది. వారిదే మరొక మధుర పూరణం. సమస్య ఈసారి శార్దూలవిక్రీడిత పద్యపాదం. “అమ్మా! రమ్మని పిల్చె భార్యను, మగం డయ్యర్థరాత్రంబునన్ ” || “ఆ అర్థరాత్రి, తన...

1

సాహిత్యము-సౌహిత్యము – 29 : స్వాముల వారికిన్ కడుపు పండి జనించిరి పుత్ర రత్నముల్

శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తిః :— 25—11—2017; శనివారము. సాహిత్యము—సౌహిత్యము~29. శ్రీ ప్రతాప సుబ్రహ్మణ్యశాస్త్రివరిష్ఠుల ప్రతిభా పాటవాలు అసాధారణమైనవి అనితరసాధ్యమైనవి. వారి ప్రజ్ఞా వైదగ్ధ్యంతో పునీతమైన పూరణ మరొకటి ఈ రోజు మీ ముందుకి ఘనంగా వస్తోంది. ఉత్పలమాల ఛందస్సులోని పద్యం. “స్వాముల వారికిన్ కడుపు పండి జనించిరి పుత్ర రత్నముల్...

3

సాహిత్యము-సౌహిత్యము – 28 : పగలు శశాంకు డంబరము పైన వెలింగెను తీక్ష్ణకాంతితో

శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తిః :— 18—11—2017; శనివారము. సాహిత్యము—సౌహిత్యము~28. ఈ వారంకూడా శ్రీ ప్రతాప సుబ్రహ్మణ్య శాస్త్రివర్యుల సమస్యాపూరణం చూద్దాం. సమస్య చంపకమాల చతుర్థపాదం. “పగలు శశాంకు డంబరము పైన వెలింగెను తీక్ష్ణకాంతితో” || “పగలు చంద్రుడు పైన ఆకాశంలో వేడి వెన్నెలతో వెలుగులు చిమ్ముతున్నాడు” అని...

1

సాహిత్యము-సౌహిత్యము – 27 : సానిన్ కొల్చిన వారి కబ్బును కదా! సౌశీల్య సౌభాగ్యముల్

శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తిః :— 11—11—2017; శనివారము. సాహిత్యము—సౌహిత్యము~27. ఈ వారం, సాహిత్య సంగీత హరికథా కళా కోవిదులు, శ్రీ ప్రతాప సుబ్రహ్మణ్య శాస్త్రివర్యుల సమస్యాపూరణం చూద్దా. ఇది మన సత్సంగ సభ్యులకి  చేరడం 11—11—2017; శనివారం ఐనా, ఈ అంశాన్ని “దీపావళి” పర్వదినం రోజున, అంటే,...

2

సాహిత్యము-సౌహిత్యము – 26 : మరలందున్నది నాతి యోర్తు దివిషన్మాన్య ప్రభావమ్మునన్

శ్రీశారదా వాత్సల్య మందాకినీ :— 04—11—2017; శనివారము. సాహిత్యము—సౌహిత్యము~26. ఈ వారం సమస్య యాంత్రికంగా వున్మట్లు కనిపించినా పూరణలోని గొప్పతనంవలన దేవతాస్తుతిగా మారి మాన్యతని పొందింది. సమస్య యిది:— “మరలందున్నది నాతి యోర్తు దివిషన్మాన్య ప్రభావమ్మునన్ “|| “అంటే యంత్రాల మధ్యవున్న ఒక స్త్రీమూర్తి దేవతల పూజింపబడతగిన...