Category: Saahityamu-Souhityamu

1

సాహిత్యము-సౌహిత్యము – 55 : పెద్ద నై ష్ఠికుడై ఉండెడువాడు నీవగుట, తా చిత్రంబె? సర్వేశ్వరా

ఐం శ్రీశారదా పరదేవతాయై నమోనమః| 26—05—2018; శనివారము| శ్రీశారదాంబికా స్ఫూర్తిచంద్రికా| “సాహిత్యము ~ సౌహిత్యము—55″| క్రితం వారం, యథావాక్కుల అన్నమయ్యకవివరుల “సర్వేశ్వరశతకం” లోని “తరులన్ పూవులు పిందెలై – – – ” ఇత్యాది పద్యం ఉదహరించుకుని ఆ  పద్యంలోని కవిగారి భక్తిభావనయొక్క మాధుర్యం ౘవి చూసేం! ఆ...

2

సాహిత్యము-సౌహిత్యము – 54 : హర! మీ పాద పయోజ పూజితములై అత్యద్భుతం బవ్విరుల్

ఐంశ్రీశారదాపరదేవతాయైనమోనమః| 19—05—2018; శనివారము| శ్రీశారదాంబికా వాత్సల్యచంద్రికా| “సాహిత్యము—సౌహిత్యము ~ 54″| నాకు అనవరత పూజ్య పుంభావ సరస్వతి, నాయందు సర్వదా అపారవాత్సల్యం చూపిన మా నళినీచిన్నాన్నగారు, అంటే శ్రీ బాలాంత్రపు నళినీకాంతరావువర్యులు, (శ్రీ బొమ్మకంటి శ్రీనివాసాచార్యులవారితోకలిసి), “ఆంధ్రజాతి ‘అంతరంగ‘ కారువు – తెలుగు చాటువు – పుట్టుపూర్వోత్తరాలు”...

2

సాహిత్యము-సౌహిత్యము – 53 : కరగె పో పో న్నీళ్ళకున్ పల్చనై

ఐంశ్రీశారదాపరదేవతాయైనమోనమః| 12—05—2018;  శనివారము| శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తి| “సాహిత్యము – సౌహిత్యము ~ 53″| రమారమి 1600వ సంవత్సర సమీపంలో, శ్రీ సారంగు తమ్మయ్యకవిగారు, “వైజయంతీ విలాసము” అనే పేరుతో సుప్రసిద్ధమైన “విప్రనారాయణచరిత్ర“ని, ౘక్కని పద్యకావ్యంగా రచించేరు. శ్రీ బొమ్మకంటి వేంకట సింగరాచార్యగారు,  శ్రీ బాలాంత్రపు నళినీకాంతరావుగారు...

2

సాహిత్యము-సౌహిత్యము – 52 : తలలొక్కేబదినాల్గు కానబడియెన్ తద్గౌరి వక్షంబునన్

ఐంశ్రీశారదా పరదేవతాయై నమోనమః| 05—05—2018; శనివారము| శ్రీశారదా కరుణా వరుణాలయమ్ | “సాహిత్యము – సౌహిత్యము ~ 52″| శ్రీ దీపాల పిచ్చయ్యశాస్త్రిగారి “చాటుపద్య రత్నాకరము“లో ఈ సమస్య ప్రస్తావించబడింది. మనకి సుపరిచితులైన, శ్రీ మోచర్ల వెంకన్నగారు ఈ సమస్యని పూర్తిచేసేరు. నెల్లూరుసీమకిచెందిన వెంకటగిరి రాజావారైన, శ్రీ...

4

సాహిత్యము-సౌహిత్యము – 51 : జగద్వ్యాప్తములయ్యె ఇరులు ఖరకరుడుండన్

ఐం శ్రీశారదా పరదేవతాయై నమః| 28—04—2018;  శనివారము| శ్రీశారదా వాత్సల్య జ్యోత్స్నా| సాహిత్యము—సౌహిత్యము~51| ఈ వారంకూడా రాజశేఖర-వేంకటశేషకవుల “అవధాన సారము” లోని మరొక విలక్షణ సమస్యాపూరణాన్ని తిలకించి పులకిత మనస్కులమౌదాం! ఇప్పుడు సమస్యని పరిశీలిద్దాం! “జగద్వ్యాప్తములయ్యె ఇరులు ఖరకరుడుండన్ “|| సమస్యని చూచీచూడగానే ఏ ఛందస్సో తెలియదు....

8

సాహిత్యము-సౌహిత్యము – 50 : రాముని రాక్షసాంతకుని దాశరథిన్ వినుతించుటొప్పునే?

శ్రీశారదాదేవ్యై నమోనమః| 21—04—2018;  శనివారము| శ్రీశారదా దయా చంద్రికా| “సాహిత్యము—సౌహిత్యము~50″| ఈ వారంకూడా ఛందస్సుకి సంబంధించిన సాంకేతికాంశం ‘సమస్య’లో చేర్చబడింది. ముందు సమస్యని పరిశీలిద్దాం! “రాముని రాక్షసాంతకుని దాశరథిన్ వినుతించుటొప్పునే?”| “రాక్షసులని నిర్మూలిస్తున్న దశరథకుమారుడైన రాముడిని విశేషంగా కీర్తించడం తగిన పనేనా?” అని ఈ సమస్యకి అర్థం....

6

సాహిత్యము-సౌహిత్యము – 49 : ఉత్పలగంధిరో యిపుడు నీవూహూయనన్ పాడియే ?

శ్రీశారదా కారుణ్య కౌముదీ| 14—04—2018; శనివారము| “సాహిత్యము—సౌహిత్యము~49″| ఇంతవరకు ౘాలారకాల సమస్యాపూరణాలు పరికించేం. ఈ వారం సమస్యలో ఛందస్సుకి సంబంధించిన సమస్యకూడా ఇమిడివుంది. ఆ సమస్య ఏమిటో చూద్దాం. “ఉత్పలగంధిరో యిపుడు నీవూహూయనన్ పాడియే?”|| “నీలికలువ పరిమళంతో గుబాళిస్తున్న సుందరీ! ఇప్పుడింక నీవు, “ఊహూ” (కాదు) అనడం...

5

సాహిత్యము-సౌహిత్యము – 48 : సారెకు సారెకున్ మరియు సారెకు సారెకు సారెసారెకున్

ఐంశ్రీశారదా పరదేవతాయై నమః| 07—04—2018;  శనివారము| శ్రీశారదా కరుణా కౌముది :— “సాహిత్యము—సౌహిత్యము~48″| ఇంతవరకు, ఈ “పునరుక్తి చమత్కృతి“లో రసరమ్యసమస్యాపూరణాలని మాత్రమే ప్రత్యేకంగా ఎంపికచేసి, మన సత్సంగ రసజ్ఞులకి నివేదించడమయ్యింది. ఇంతకిముందువారం అనుకున్నవిధంగానే, ఈ వారంతో “పునరుక్తి చమత్కృతి”కి భరతవాక్యం పలికి, వచ్చేవారంనుంచి, యథాపూర్వంగా సమస్యాపూరణయాత్రని కొనసాగించవచ్చు....

4

సాహిత్యము-సౌహిత్యము – 47 : ఆర్ష తాత్త్విక దర్శన స్ఫూర్తిలో నిను నిను నిన్ను నిన్ను మరి నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్

శ్రీశారదా కరుణా కౌముది :— 31—03—2018;  శనివారము. “సాహిత్యము—సౌహిత్యము~47″| రామాయణ/భారత/భాగవత పరమైన విషయాలని, సమస్యాపూరణానికి వస్తువులు(themes)గా స్వీకరించి, శ్రీ మోచర్ల వెంకన్నగారు గతంలో పూరించి, శ్రీశారదాదేవి అమ్మవారి దివ్య కంఠసీమలో అలంకరించిన వసివాడని  “చంపక మాలలు“యొక్క పరిమళాలని, అందౘందాలని మూడువారాలుగా మన రసజ్ఞ సత్సంగ సభ్యులు ౘక్కగా...

3

సాహిత్యము-సౌహిత్యము – 46 : భాగవతార్థంలో నిను నిను నిన్ను నిన్ను మరి నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్

శ్రీశారదా కృపా జ్యోత్స్న :— 24—03—2018;  శనివారము.”సాహిత్యము—సౌహిత్యము~46″. “పునరుక్తి చమత్కృతి” వరుసలో, ఈ వారంకూడా గత రెండువారాలుగా ప్రస్తావించుకుంటున్న ‘చంపకమాల‘ పద్యపాద సమస్యని శ్రీ మోచర్ల వెంకన్న కవివరులు భాగవతార్థంలో ఏవిధంగా పూరించేరో గమనిద్దాం! సమస్య :— “నిను నిను నిన్ను నిన్ను మరి నిన్నును నిన్నును...