Category: Kadambakam

4

కదంబకం — 16 : కాలం

శ్రీశారదా దయా సుధ :— 15—10—2017; ఆదిత్యవారము. కదంబకం—16. ఈ రోజు మన తెలుగు సాహిత్యంలో “కాలం(ము)” గురించి పెద్దలమాటల రత్నాలమూటలని ఒక్కసారి తెరిచి చూద్దాము:— 1.కాలంబొక్క విధంబుననుండక పెక్కు ప్రకారములనుండు భిన్నావస్థన్ | —నన్నయ-భారతం-ఆరణ్యపర్వం-3. “కాలం ఒకే విధంగా ఉండదు. ఆయా స్థితి-గతులనిబట్టి రకరకాలుగా మారుతూవుంటుంది”...

2

కదంబకం — 15 : శ్రీరామ వనవాస గమనము

శ్రీశారదా దయా సుధ :— 08—10—2017; ఆదిత్యవారము. కదంబకం—15. ఈ రోజు శ్రీ వేంకటపార్వతీశ్వరకవుల “నిర్వచన రామాయణము” లోని అయోధ్యాకాండము లోవున్న “శ్రీరామ వనవాస గమనము” ఘట్టం గురించి సక్షిప్తంగా చూద్దాము! ఆ సమయంలో అంతఃపురస్త్రీలు హాహాకిరాలతో దుఃఖిస్తూ ఇలా అంటున్నారు: “ఎటకేగుచున్నాడొ హీనదీనానాథ తాపసోద్ధారి మా...

5

కదంబకం — 14 : సంస్కృతలోకోక్తులు

శ్రీశారదా దయా సుధ :— 01—10—2017; ఆదిత్యవారము. కదంబకం — 14. ఈ రోజు “కదంబకం”లో మనకి సదా ఉపయోగపడే సంస్కృతలోకోక్తులు, తెలుగు అనువాదంతోసహా తెలుసుకుందాం! 1. అనాథో దేవరక్షకః| = దిక్కులేనివారికి దేవుడే దిక్కు. 2. అన్నస్య క్షుధితం పాత్రమ్ | =  ఆకలితోవున్నవాడే అన్నదానానికి పాత్రుడు....

1

కదంబకం — 13 : శ్రీ కాసుల పురుషోత్తమకవి

శ్రీశారదా కారుణ్య కౌముది :— 24—09—2017; ఆదిత్యవారము. కదంబకం—13. శ్రీ కాసుల పురుషోత్తమకవిగారి పద్యపుష్పాలు:— 1. “అచటలేవనికదా అరచేతచరచె క్రుద్ధత సభాస్తంభంబు దైత్యరాజు అచటలేవనికదా అస్త్రరాజంబేసె గురుసుతుండుత్తరోదరము నందు అచటలేవనికదా యతి కోపిననిచె పాం డవులున్న వనికి కౌరవ కులేంద్రు డచటలేవనికదా యత్నించె సభనుద్రౌ పది వల్వలూడ్వ...

1

కదంబకం — 12 : మహాకవి భవభూతి

శ్రీశారదా కారుణ్య కౌముదిః :— 17—09—2017; ఆదివారము. కదంబకం—12. మహాకవి భవభూతి పవిత్ర భావ ప్రపంచం—జనజీవనకాంతిపుంజం. ఈ రోజు “శారదా సంతతి”లో భవభూతివర్యులగురించి సంక్షిప్తంగా తెలుసుకుని, వారి బోధ, సందేశం గురించి ఈ శీర్షికలో వివరించుకుందాం అనుకున్నాం. ఇప్పుడు ఆ విషయంలో నిమగ్నమౌదాం! 1. “తపస్వీ! కాం...

2

కదంబకం — 11 : థేలీజ్ (Thales)

శ్రీశారదా కారుణ్య కౌముదీ :— 10—09—2017; ఆదివారం. కదంబకం—11. థేలీజ్ —Thales—c. 624~547 B.C. థేలీజ్ పాశ్చాత్య తత్త్వశాస్త్రానికి తండ్రివంటివాడని చరిత్రకారుల అభిప్రాయం. వారు స్వయంగా రచించిన గ్రంథాలేవీ లభించకపోయినా వారితరవాత తత్త్వజ్ఞులు వారిగురించి వ్రాసినవిషయాలు మనకి లభిస్తున్నాయి. గ్రీకుదేశపు సప్తర్షులుగా ప్రసిధ్ధిగడించినవారిగా అనేకమేధావుల జాబితాలన్నింటిలో తప్పనిసరిగా...

3

కదంబకం — 10 : రబియా (Rabia)

శ్రీశారదా వాత్సల్య దీప్తిః :— 03—09—2017; ఆదివారం. కదంబకం—10. ఈ నాడు ఈ శీర్షికలో ఈశ్వరవరపుత్రిక రబియాసాధ్వి గురించి మరికొన్ని వివరాలు తెలుసుకుందాం. “శారదా సంతతి”లో కూడా ఈరోజు ఆమె గురించి మాధ్యమపరిమితికి లోబడి అసంపూర్ణంగానే తెలుసుకున్నాం. రబియాని సూఫీ మీరాబాయి అనీ, సూఫీ సెయింట్ థెరీసా...

4

కదంబకం — 9 : శ్రీ సి. రామచంద్ర (C.RamaChandra)

శ్రీశారదా కారుణ్య కౌముదీ  :— 27—08—2017; ఆదివారం. కదంబకం—9. శ్రీమాత చిన్మయ సంగీత వీచిక— శ్రీ సి. రామచంద్ర హిందీ చలనచిత్రసంగీతదర్శక చక్రవర్తులలో రెండవతరానికి చెందిన పరిపూర్ణ సంగీత ప్రజ్ఞావంతులలో సి. రామచంద్ర ఒకరు. ఆయన వరసలు కట్టిన పాటలు కల్పతరుప్రసూనమకరంద ధారలు; కామధేనుక్షీరకలశాలూను. వారు మహారాష్ట్రులు....

2

కదంబకం — 8 : శబ్దం

శ్రీశారదా దయా చంద్రికా :— 20—08—2017; ఆదివారము. కదంబకం—8. ఈ వారం “మాట” లేక “శబ్దం” గురించి డా.బి.శ్రీనివాస్ గతంలోచేసిన సూచన మేరకి ఈ క్రింది విషయాలు సంక్షిప్తంగా చర్చించుకుందాం. 1. “స్ఫోట(ము)”/ శబ్దబ్రహ్మవాదం. 2. “నాదబ్రహ్మ”వాదం. 3. పరా, పశ్యంతీ, మధ్యమా, వైఖరీ తత్త్వవివేచన. 1. స్ఫోట(ము)/శబ్దబ్రహ్మవాదం:—...

4

కదంబకం — 7 : శ్వయువమఘోనామతద్ధితే

శ్రీశారదా దయా దీప్తిః :— 13—08—2017;  ఆదివారం. కదంబకం—7. ఈ వారం సంస్కృతవ్యాకరణంతో ముచ్చటలాడే రెండు రమ్యమైన చాటుశ్లోకాలలోని చమత్కారాలని వివరించుకుందాం. మొదటి శ్లోకం యిది:— “కాచం మణిం కాంచనమేకసూత్రే| గ్రథ్నాసి ముగ్ధే! కిము చిత్రమత్ర | అశేషవిత్ పాణినిరేకసూత్రే | శ్వానం యువానం మఘవానమూచే||” ఒక పండితుడు తనముందు...