సాహిత్యము సౌహిత్యము – 5 : సీసపద్యం
శ్రీశారదా వాత్సల్య దీప్తిః :— చమత్కారం అనే ఉత్ప్రేరకం (catalyst) ద్వారా వినోదాన్ని, విజ్ఞానదాయకమైన విద్యని మన పెద్దలు ఎంతౘక్కగా మేళవించి మనకి అందించేరో మనం గ్రహిద్దాం. సీసపద్యం పేరు పరిచితమైనదే! ఈ పద్యాలు సంగీతంలో వరసకట్టి పాడుకోవడానికి ౘక్కగా ఉంటాయని మన పౌరాణిక నాటక-చలనచిత్రాలని చూచేవారికి తెలుస్తుంది....