Category: శాస్త్రవిషయములు

0

సంగీతం—నాదవేదం—45

8—5—20201; శనివారం ॐ (ఈ వృత్తాంతం జరిగే సమయానికి మా చిన్నాన్నగారికి సుమారు 28 సంవత్సరాల వయస్సు ఉండి ఉంటుందని చెప్పేను కదా! ఇంక, వారిగురించి సంక్షిప్తపరిచయం చేసుకుందాం! వారు కాళిదాసు రచించిన “మేఘసందేశమ్॥” సంస్కృతకావ్యకథకి పూర్వరంగమైన మూలకథని తెలుగులో “హేమమాలి” అనే పద్యకావ్యంగా విరచించి బుధజన...

0

సంగీతం—నాదవేదం—44

01—05—02021; శనివారం ॐ మనం ఐదవది ఐన బాణచక్రం లోని నాలుగవ మేళకర్త అంటే మొత్తంమీద 28వ మేళకర్త ఐన హరికాంభోజిరాగం, ఆ రాగంయొక్క కొన్ని ముఖ్యజన్యరాగాలు గురించి సంక్షిప్త పరిచయం, ఇతర విశేషాలు తెలుసుకున్నాం. ఇప్పుడు బాణచక్రంలోని ఐదవ మేళకర్తరాగం లేక మొత్తంమీద, “కటపయాది సంకేత...

0

సంగీతం—నాదవేదం—43

24—4—2021; శనివారం. ॐ హరికాంభోజికి తరువాయి జన్యరాగం సరస్వతీమనోహరి రాగం. ఈ రాగంలో త్యాగరాజస్వామి “ఎంత వేడుకొందు రాఘవా! ~ పంతమేలరా? ఓ రాఘవా! (దేశాదితాళం)” అనే ఒక కృతిని రచించేరు. దీక్షితస్వామి “సరస్వతీమనోహరి! శంకరి! సదానందలహరి! గౌరి! శంకరి! ॥సరస్వతీమనోహరి॥ (ఆదితాళం)” అనే ఒక కృతిని...

0

సంగీతం—నాదవేదం—42

17—04—2021; శనివారం. ॐ 28వ మేళకర్త అయిన హరికాంభోజికి జన్యరాగాలలో (అకారాది క్రమంలో లేక alphabetical order లో) సుప్రసిద్ధరాగం, శహాన రాగం. ఈ రాగం సంపూర్ణ—సంపూర్ణ రాగం. అంటే ఆరోహణ—అవరోహణలలో సప్తస్వరాలూ ఉంటాయి. ఇది ఉపాంగరాగంగానే శాస్త్రాలలో చెప్పబడింది. ఆరోహణ—అవరోహణలు రెండింటిలోను వక్రసంచారాలు ఉండడం వలన...

0

సంగీతం—నాదవేదం—41

10—04—2021; శనివారం. ॐ హరికాంభోజి జన్యరాగాలలో, తరువాత చెప్పుకోవలసినది “రవిచంద్రికరాగం”. రవిచంద్రికరాగంలో ఆరోహణ—అవరోహణలలో పంచమస్వరం వర్జ్యస్వరం. అందువలన రవిచంద్రిక షాడవ (6 స్వరాలు)—షాడవ (6 స్వరాలు) రాగం. త్యాగరాజస్వామివారు “రవిచంద్రికరాగం” లో, “నిరవధిసుఖద! నిర్మలరూప! నిర్జితమునిశాప! (ఆదితాళం); మాకేలరా! విచారము / మరుcగన్న శ్రీరామచంద్ర! ॥మాకేలరా॥ (దేశాదితాళం)...

0

సంగీతం—నాదవేదం—40

03—04—2021; శనివారము. ॐ హరికాంభోజి జన్యరాగాలలో మోహనరాగం తరువాత ముఖ్యమైన రసిజనరంజకమైనది, యదుకులకాంభోజిరాగం. యదుకులకాంభోజిరాగం ఔడవ—సంపూర్ణ రాగం. ఆరోహణలో గాంధారం—నిషాదం వర్జనీయస్వరాలు. అవరోహణలో అన్ని స్వరాలు ఉంటాయి. అవరోహణలో కైశికినిషాదంతోబాటు, అన్యస్వరమైన “కాకలినిషాదం” కూడా కొన్ని ప్రత్యేకప్రయోగాలలో చోటుచేసుకుని, ఈ రాగంయొక్క రంజకత్వధర్మాన్ని ఇనుమడింపజేస్తుంది. ఈ విధమైన...

0

సంగీతం—నాదవేదం—39

27—03—2021; శనివారం. ॐ త్యాగరాజస్వామి “మోహనరాగం” లో స్వరపరచిన కృతుల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం! “ఎందుకో బాగ తెలియదు—ఆదితాళం; ఎవరురా నినువినా గతి మాకు — చాపుతాళం; దయ రానీ, దయ రానీ, దయ రానీ, దాశరథీ!—ఆదితాళం; నను పాలింప నడచి వచ్చితివో, నా ప్రాణనాథా!—దేశాదితాళం; భవనుత!...

0

సంగీతం—నాదవేదం—38

20—03—2021; శనివారము. ॐ తరువాత, హరికాంభోజికి జన్యరాగం — మోహనరాగం. మోహనరాగం గురించి చెప్పాలంటే తల్లిని మించిన తనయ అని వర్ణించాలి. ఇది అత్యంత ప్రాచీనతమరాగాలలో ఒకటి! అంతేకాదు. ఇది సర్వేశ్వరుడికి వలెనే సార్వకాలిక సార్వదేశిక రాగం. ఈ రాగం వివిధదేశాలలో, వివిధజాతులలో, వివిధసంస్కృతులలో, వివిధకాలాలలో వర్ధిల్లుతూ...

0

సంగీతం—నాదవేదం—37

13—03—2021; శనివారము. ॐ తరువాయి “హరికాంభోజి” నుండి జన్యరాగం ఒక అపూర్వరాగం. దీనిపేరు ప్రతాపవరాళి రాగం. ఇది చతుస్స్వరి—షాడవ రాగం. ఆరోహణలో గ—ధ—ని స్వరాలు, అవరోహణలో ని స్వరమూ వర్జ్యస్వరాలు. ఈ రాగంలో త్యాగరాజస్వామి విననాసకొని యున్నానురా / విశ్వరూపుడనే ॥విననాస॥ (ఆదితాళం) అనే కృతిని రచించేరు....

0

సంగీతం—నాదవేదం—36

06—03—2021; శనివారము. ॐ హరికాంభోజి రాగం నుండి వచ్చిన మరొక జన్యరాగం నారాయణగౌళ రాగం! నారాయణగౌళ రాగం, షాడవ—సంపూర్ణ రాగం. ఆరోహణలో గాంధారం వర్జ్యస్వరం. ఆరోహణ—అవరోహణ రెండింటిలోను వక్రసంచారాలు ఉంటాయి. ఇది ఒక అపూర్వ (అరుదైన) రాగం. త్యాగరాజస్వామివారు, నారాయణగౌళ రాగంలో — ఇంక దయ రాకుంటే...