Category: శాస్త్రవిషయములు

0

సంగీతం—నాదవేదం—75

04—12—2021; శనివారం ॐ “దక్షిణభారత సభాసంగీత రసజ్ఞతకి పరిచయం~కొన్ని ముఖ్య విషయాలు. — Introduction to Appreciation of South Indian Concert-Music~A few Important Aspects.” దక్షిణభారత ప్రౌఢ (శాస్త్రీయ) సంగీతం పుష్కలమైన వివిధప్రక్రియావైవిధ్య వైభవంతో కూడిన గేయ నిధితో, లేక ౘాలారకాలైన పాటల పూల...

0

సంగీతం—నాదవేదం—74

27—11—2021; శనివారము. ॐ దక్షిణభారతీయ సభాసంగీతంలో ప్రాముఖ్యత కలిగి, తరచుగా వినబడే ప్రధాన తాళాల పరిచయం ఇప్పుడు చేసుకుందాం. నాదమయకళ అయిన సంగీతంలో స్వరవైభవం అర్థనారీశ్వరమూర్తిలో ప్రకాశించే ఉజ్జ్వల కామేశ్వరీమాత అయితే, మహాతేజోమయమూర్తి కామేశ్వరుడు లయాధీనమైన తాళక్రమశిక్షణా స్వరూపుడు. సంగీతమయ కాలప్రమాణ గమనగతిని నిర్దేశించగలిగిన తాళప్రక్రియాతత్త్వం మహాకాలుడైన...

0

సంగీతం—నాదవేదం—73

20—11—2021; శనివారము ॐ ఇప్పుడు వివాదిస్వరమేళకర్తలైన 40 రాగాలేవో తెలుసుకుందాం. 1వ చక్రం లోని ఆరు మేళకర్త రాగాలు, అలాగే ఆరవ చక్రంలోని ఆరు మేళకర్త రాగాలు, అదేవిధంగా 7వ, 12వ చక్రాలలోని 6+6=12 మేళకర్త రాగాలు, అంటే, మొత్తం 6×4=24 మేళకర్త రాగాలూకూడా వివాదిస్వర మేళకర్త...

0

సంగీతం—నాదవేదం—72

13—11—2021; శనివారం. ॐ మనం పరిచయం చేసుకున్న 72—మేళకర్త రాగాలలో 32 మేళకర్తలు “వాది(స్వర) మేళకర్తలు” గాను, మిగిలిన 40 మేళకర్తలు “వివాది(స్వర) మేళకర్తలు” గాను దక్షిణభారతసంగీతశాస్త్రజ్ఞుల చేత విభజింపబడ్డాయి. ఇప్పుడు మనం వాదిస్వరాలు, వివాదిస్వరాలు మొదలైన అంశాలగురించి సంక్షిప్తంగా తెలుసుకోవాలి. ఒక “OCTAVE” లేక “స్వరసప్తకం”...

0

సంగీతం—నాదవేదం—71

06—11—2021; శనివారము. ॐ 72 మేళకర్తరాగాలు, వాటి జన్యరాగాలు కొన్ని వాౘవిగా పరిచయం చేసుకున్నాక యిప్పుడు సంగీత శాస్త్ర సంబంధమైన కొన్ని ప్రధాన విషయాల గురించి లఘువుగా పరిచయం చేసుకుందాం. కర్ణాటక సంగీత సంప్రదాయంలో వినియోగించబడెడి కొన్ని ప్రధాన సాంకేతిక అంశాలగురించి తెలుసుకుందాం. ఇంతకుముందు వివరించబడిన రాగాల...

0

సంగీతం—నాదవేదం—70

30—10—2021; శనివారం. ॐ ఇప్పుడు చివరిదైన ద్వాదశ (పన్నెండవ) చక్రం, అంటే, “ఆదిత్య (ద్వాదశ ఆదిత్యులు) చక్రం” లో ఉన్న ఆరు జనక రాగాల గురించి పరిచయం చేసుకొన బోతున్నాం! ఈ చక్రంలో ఉన్న ఆరు మేళకర్తరాగాలలో “రు-గు” స్వరాలతోబాటు, ప్రతిమధ్యమం కూడా ఉండడం ఈ రాగాలయొక్క...

0

సంగీతం—నాదవేదం—69

23—10—2021; శనివారం. ॐ 65వ మేళకర్త కల్యాణిరాగజన్యమైన రాగాలలో “సారంగరాగం” సుప్రసిద్ధమైన మనోరంజక రాగం. సారంగరాగం సంపూర్ణ-(వక్ర)సంపూర్ణ రాగం. ఇది ప్రతిమధ్యమ జన్యరాగమైనా, దీనిలో ప్రత్యేక ప్రయోగంలో శుద్ధమధ్యమం కూడా సంప్రదాయసిద్ధంగా ఉంది. అందువలన (అన్యస్వరప్రయోగం వలన) యిది భాషాంగరాగంగా పరిగణింపబడుతూంది. త్యాగయ్యగారు సారంగరాగంలో — “ఓడను...

0

సంగీతం—నాదవేదం—68

16—10—2021; శనివారము. ॐ 65వ మేళకర్త “మేచకల్యాణిరాగం”. రాగాలకి అన్నింటికీ రారాణి అయిన కల్యాణిరాగం ఈ రాగ జన్యమే! రాగాలకన్నింటికీ రారాజు “29వ మేళకర్త జన్యరాగమైన శంకరాభరణరాగం”, (శుద్ధమధ్యమరాగం) ఐతే, ఆ రాగానికి ప్రతిమధ్రమరాగమైన (29+36=65వ మేళకర్త—మేచకల్యాణి) కల్యాణిరాగం రారాణి కావడం సంగీతపరమైన అర్ధనారీశ్వరస్వరూపం అని చెప్పవచ్చు....

0

సంగీతం—నాదవేదం—67

09—10—2021; శనివారము. ॐ ఇప్పుడు ఏకాదశ (పదకొండవ) చక్రమైన “రుద్రచక్రం” లోని ఆరు రాగాల పరిచయం చేసుకుందాం! రుద్రచక్రంలోని ఆరురాగాలు “రి-గు” స్వరాల సామాన్య లక్షణం కలిగి ఉంటాయి. ఈ చక్రంలో మొదటి మేళకర్త రాగం, అంటే, మొత్తంమీద 61వ జనకరాగం పేరు: “కాంతామణిరాగం”. (దీనిని దీక్షితులవారి...

0

సంగీతం—నాదవేదం—66

02—10—2021; శనివారము. ॐ 58వ మేళకర్త పేరు “హేమవతిరాగం”. హేమవతిరాగం 22వ మేళకర్త అయిన (శుద్ధమధ్యమంతో కూడిన) ఖరహరప్రియరాగానికి, (శుద్ధమధ్యమ రహిత) ప్రతిమధ్యమ యుత రాగం అన్నమాట! ఈ హేమవతిరాగంలో “రి-గి-ధి-ని” స్వరాలు ఉంటాయి. “సంపూర్ణ-సంపూర్ణ” రాగమైన హేమవతి (దీక్షితులవారి పద్ధతిలో “దేశిసింహారవం రాగం) రాగంలోని స్వరచలనక్రమం...