భీష్మాష్టమీపర్వదినము
ఐంశ్రీశారదాపరదేవతాయై నమోనమః| 12—02—2019; మంగళవారము. శ్రీశారదాంబికా దయాచంద్రికా| “ఇతరములు—భీష్మాష్టమీపర్వదినము”| మాఘశుక్ల అష్టమిని భీష్మాష్టమిగా పెద్దలు నిర్దేశించేరు. ఈ పర్వదినాన భీష్ములవారికి శ్రాద్ధకర్మనిర్వహించడంవలన సంతానప్రాప్తి ఉంటుందని శాస్త్రవచనం. అందువలన ఈ శ్రాద్ధక్రియ కామ్యకర్మగా వర్గీకరించబడింది. ఈ రోజు భీష్ములవారికి తర్పణసమర్పణం నిత్యకర్మ అని విధించబడింది. ఈ తర్పణసమర్పణంవలన సంవత్సరకాలంలో...