Fun facts – 16

శ్రీశారదా దయా చంద్రికా:—
07—10—2017; శనివారము.

వాస్తవాలు~వినోదాలు/Fun-Facts—16.

1. మన శరీరం ఒక కర్మాగారం అని చెపితే దానిలో అత్యుక్తి-అల్పోక్తి దోషాలు ఏమీలేవు. ఆరోగ్యవంతమైన పరిణతవయస్కుడి దేహంలో ఆరు అంగుళాల పొడవున్న ఒక మేకు తయారుచేయడానికి సరిపోయే ఇనుము ఉంటుంది. 9,000 పెన్సిళ్ళు తయారుచేయడానికి సరిపడ లెడ్ ఉంటుంది.
2,000 అగ్గిపుల్లల కొసలకి సరిపడే భాస్వరం ఉంటుంది. 7 సబ్బుబారులు చేయడానికి తగిన క్రొవ్వు ఉంటుంది. 3 పౌనుల కేల్షియం ఉంటుంది.  ఆఖరిమాటగా ఔన్సు ఉప్పు కూడా ఉంటుంది. ఈ విధంగా శాస్త్రజ్ఞులు అంటున్నారు.

2. ఒక స్త్రీ సుమారు ఒకనెలకి 5.3 మారులు దుఃఖిస్తుందిట! పురుషుడైతే సుమారు నెలవొక్కింటికి 1.4 మారులు కళ్ళనీళ్ళు పెట్టుకుంటాడుట. స్త్రీ-పురుషులు ఉభయులూ రోజుకి సుమారు 15 సార్లు నవ్వుతారట!

3. బారిస్టరు ఫ్రెడరిక్ స్మిత్ తరవాత కాలంలో లార్డ్ బిర్కెన్ హెడ్ అయ్యేడు. ఒకసారి త్రాగే అలవాటున్న ఒకసాక్షిని కోర్టులో ఒకతగాదావిషయంలో ప్రశ్నిస్తూ లార్డ్ బిర్కెన్ హెడ్ యిలా అన్నాడు: ” ఆ సమయంలో నువ్వు జడ్జిగారిలాగ త్రాగివున్నావన్నమాట“?
వెంటనే జడ్జిగారు యిలాఅన్నారు: “బహుశః మీరు లార్డుగారిలాగ అనబోయి అలా అని ఉంటారు“!
దానికి జవాబుగా లార్డు బెర్కెన్ హెడ్ ఏమీ తడుముకోకుండా ఇలా జవాబు యిచ్చేరు: “తమ లార్డ్ షిప్ ఎలా అనుకుంటే అలాగే ప్రభూ“!

You may also like...

1 Response

  1. సి.యస్ says:

    ప్రకృతిలో ఉన్నవన్నీ మనిషి శరీరంలో ఉండడంమూలానే కాబోలు , ప్రకృతికీ పురుషుడికీ పోలిక చెప్తారు.
    రెండవ అంశం కొంచెం సందేహంగా ఉంది. రోజుకి ఒకసారీ నవ్వని
    వాళ్ళని (నవ్వితే తల వెయ్యి చెక్కలైపోతుందేమోనని శాపమున్నట్టుగా) కొందర్ని చూస్తున్నాం. శాస్ర్రజ్ఞుల సిద్ధాంతాలు కొన్ని, తదనంతర కాలంలో తప్పని రుజువవుతుంటాయి కదా!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *