Fun facts – 15

శ్రీశారదా దయా చంద్రిక :—
30—09—2017; శనివారము.

వాస్తవాలు-వినోదాలు/Fun-Facts-15.

1. జూడీ గార్లేండ్ నటించిన విజయవంతమైన చిత్రం “The Wizard of Oz“, 1939 లో విడుదలయ్యింది. మూకీ చిత్రాల యుగంలో అదే సినిమా రెండు మారులు చిత్రీకరించబడింది. 1924లో వచ్చిన మూకీ సినిమాలో tin man (పాత్రలకి తగరపు కళాయిపెట్టే కమ్మరి)గా అమెరికాలోని జార్జియా రాష్ట్రం నుంచి మంచిలావుగావున్న Oliver Hardy ని రప్పించి ఆ పాత్రని నటింపచేసేరు. రెండు సంవత్సరాల తరవాత Stan Laurel తో కలిసి ఆయన నటించడం ప్రారంభించేరు. వారిద్దరే ఆ కాలంలో లారెల్ & హార్డీ గా ప్రపంచ ప్రసిద్ధి పొందినహాస్య నట ద్వయం.

2. Orville Wright, Wilbur Wright అన్నదమ్ములు. వారిద్దరే రైటు సోదరులుగా లోకఖ్యాతి గడించేరు. 1903లో అమెరికాకి చెందిన ఉత్తర కరొలినా రాష్ట్రంలోని కిట్టీ హాక్ నగరంలో 120 అడుగుల ప్రయాణాన్ని వారు చారిత్రాత్మక ప్రథమ విమానంద్వారా చేసేరు. అది బోయింగ్ 747 విమానం,
“జంబో జట్ “. దాని పొడుగు 231.8 అడుగులు.

3. సుప్రసిద్ధ హాలీవుడ్ నటుడు, బాబ్ హోప్ “రోడ్ టు మొరాకో” సినిమాకోసం బింగ్ క్రాస్బీతో కలిసి పనచేస్తున్నాడు. ఆ సందర్భంలో Rabat నగరంలో లొకేషన్ షూటింగ్ కోసం ఒక హొటల్లో న్నాడు. అతడికి రూంసర్వీస్ అవసరమైంది. రిసెప్షన్ కి రింగ్ చేసి రూంసర్వీసు కావాలంటే ఏంచెయ్యాలి అని అడిగేడు. రిసెప్షన్నుంచి అతనికి ఇలా సమాధానం వచ్చింది.”సర్ ! మీరు రూంసర్వీసు కావాలంటే ఈ విధంగాచెయ్యాలి. మొదట మీ గది తలుపు తెరవండి. తరవాత ‘రూంసర్వీస్ !’ అని పిలవండి”.

స్వస్తి ||

You may also like...

2 Responses

  1. Chaganty RamaRao says:

    Manchi information.

  2. సి.యస్ says:

    లారెల్ ,హార్డీలు ఆ విధంగా కలిశారా? భలే హాస్య జంట! మంచి విషయం తెలియచేశావు. మూడవ ఐటం లో రిసెప్సనిష్టు మరీ తెలివి ప్రదర్శించింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *