సాహిత్యము-సౌహిత్యము – 19 : కరములు ఐదు పుత్రునకు కన్నులు మూడును వాని తండ్రికిన్
శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తిః :—
16—09—2017; శనివారం.
సాహిత్యము—సౌహిత్యము~19
ఈ వారం శ్రీ కోడూరి సాంబశివరావుగారి సమస్యా పూరణంలోని అబ్బురమైన చమత్కారవైదుష్యం ఆస్వాదిద్దాం. ముందు సమస్యని తెలుసుకుందాం:—
“కరములు ఐదు పుత్రునకు కన్నులు
మూడును వాని తండ్రికిన్ ” ||
కొడుకుకి కరములు ఐదుట! ఆయన తండ్రికి కన్నులు మూడుట!
శివకుటుంబానికి చెందిన కొడుకు-తండ్రి, ఇరువురికి అన్వయించి శ్రీ సాంబశివరావుగారు చెప్పిన పద్యం చూడండి. ఇది చంపకమాలవృత్తంలో ఉంది.
“కరములు నాల్గు తుండమును కల్గి
వినాయకుడయ్యె పుత్రుడా
గిరిజకు ఎన్న ఆమె పతికిన్ నుదుటన్
కనుకల్గు స్వామికిన్
కరమన చేయి, తుండమగు కావున
తుండము చేర్చె లెక్కకున్
కరములు ఐదు పుత్రునకు కన్నులు
మూడును వాని తండ్రికిన్ ” ||
సంస్కృతభాషలో “కరము” అంటే చేయి, ఏనుగు తుండము అనే రెండు అర్థాలు ఉన్నాయి. ఈ విషయం ఆధారంగాచేసుకుని, ఈ వివరాన్ని పద్యంలొ అందరికీ చక్కగా అర్థం అయ్యేలాగ ఈ పద్యాన్ని అల్లి రసిక హృదయులముందు ఉంచేరు, శ్రీకోడూరివారు.
“గిరిజ ఐన పార్వతీదేవికి, త్రినేత్రుడు లేక ముక్కంటికి అంటే ఆ ఆది దంపతులు యిరువురికి వినాయకుడు కొడుకు అయ్యేడు. ఆ వినాయకుడికి నాలుగు చేతులు, ఒక తుండము కలిపి “ఐదు కరములు” ఉన్నాయి. వారి తండ్రి శంకరభగవానుడికి ఫాలనేత్రంతో కలిపి మొత్తం మూడు కళ్ళున్నాయి. అందువలన కొడుకుకి ఐదు కరములు, తండ్రికి మూడు కన్నులు లెక్కకి వచ్చేయి”.
స్వస్తి ||
ఆహా! ఏమి సద్యః స్ఫురణ..?. కిట్టింపు పద్యం కాకుండా వినే వాళ్ళకి లేదా చదివే వాళ్ళకి ఆహ్లాదం కలిగించేటట్టు అందమైన పూరణ. కిట్టుబాటైంది