Fun facts – 10

శ్రీశారదా దయా చంద్రికా :—
26—08—2017; శనివారం.

వాస్తవాలు-వినోదాలు-Fun-facts-10.

1. William Wrigley ఒక బేకింగు పౌడరు తయారుచేసి మార్కెట్లో అమ్మకాలు ప్రారంభించేడు. కొనుగోలుదారులని ఆకర్షించడానికి బేకింగు పౌడరు పేకెట్లతో చూయింగ్ గం స్టిక్స్ ఉచితంగా యిచ్చేవాడు.
ఐతే బేకింగు పౌడరు పేకెట్లకన్న, చూయింగ్ గం చాలా ఎక్కువ ప్రజాదరణపొందడం గమనించి ఆయన కేవలం చూయింగ్ గం తయారీ పెంచి అమ్మకాలూ పెంచుకుని క్రమంగా ప్రపంచవ్యాప్తంగా చ్యూయింగ్ గం సామ్రాజ్యానికి క్రౌన్లెస్ కింగ్ అంటే మకుటంలేని మహారాజు ఐపోయేడు.

2. “Aenead” కావ్యకర్త ఐన ప్రసిద్ధ రోమన్ కవి ఒక చిత్రమైన పనిచేసేడు. తనయింట్లో ఎగిరే ఒక ఈగ చచ్చిపోయింది. ఆ ఈగ తనయింటి పెంపుడుజీవిగా(pet)గా ప్రకటించేడు. అంతటితో ఊరుకోలేదు. ఆ ఈగ పార్థివదేహానికి ఘనమైన అంతిమయాత్ర నిర్వహించేడు. అలా ఆగేడా అంటే అదీలేదు. ఆ అంతిమయాత్రకి గొప్ప బాజాభజంత్రీలుకూడా ఏర్పాటుచెసేడు. దానితోసరిపెట్టేడేమోలే అంటే అలాగకూడా ఆగలేదు. చాలావ్యయంచేసి అత్యంత ఆడంబరమైన సమాధిని నిర్మింపజేసి దానిలో ఆ ఈగయొక్క అల్పశరీరాన్ని భద్రపరిచేడు. తరవాతజరిగిన సంఘటననిబట్టి చూస్తే ఈయన “పిచ్చి”లో ఒక
అంతరార్థం(a method in the madness) ఉందేమోనని సందేహం కలగకమానదు. ఆనాటి స్థానికప్రభుత్వంవారు కారణాంతరాలవల్ల వర్జిల్ గారి గృహావరణిని ౘట్టపరంగా స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించేరు. దానికి వారు ఏమాత్రం అంగీకరించలేదు. ఆయన అభ్యంతరానికి చూపించబడినకారణం ఏమిటంటే ఆ స్థలం ఒక పవిత్రసమాధిని కలిగివుండడంవల్ల ఆ ఆవరణ అంతా
పూజనీయస్థానమని ఆయన వాదించి నెగ్గేరు.

3. 1952 ఒలింపిక్సులో 400 మీటర్ల ఈతపోటీలో France కి చెందిన ఝన్ బ్వాతో (Jean Boiteaux) బంగారు పతకం సాధించేడు. అతడు ఈతకొలనులోనే తనగమ్యం వద్ద సేదతీరుతున్నాడు. అంతలోనే పూర్తిగా దుస్తులు ధరించిన ఒక ప్రేక్షకుడు హఠాత్తుగా కొలనులోకి దూకి ఈతకొట్టుకుంటూవెళ్ళి విజేత రెండుచెక్కిళ్ళమీద ముద్దులు కుమ్మరించేడు. రక్షకదళం ఆ వ్యక్తి మీద ఏవిధమైన కఠినచర్యలూ
తీసుకోలేదు. ఎందుకంటే ఆయన విజేత తండ్రే! అందువల్ల ఆయనకి శిక్షనుంచి మినహాయింపు ఇచ్చారు.

స్వస్తి||

You may also like...

2 Responses

  1. CS says:

    దేనికోసమో వెతికితే ఏదో దొరికినట్టు …విలియమ్ రిగ్లీ అదృష్టం భలే పండింది.
    ఈగ సమాధి మరీ చిత్రంగా ఉంది. వర్జిల్ గారికి ఆ ఆవరణ స్వాధీనం చేసుకోబోయే సమాచారం ముందే లీక్ చేసారేమో ప్రభుత్వంలోని అధికారులు…ఈగతో కొట్టేడు.

  2. Chaganty RamaRao says:

    Chaalaa baagunnayi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *