Fun facts – 11
శ్రీశారదా దయా చంద్రికా :—
02—09—2017; శనివారం.
వాస్తవాలు-వినోదాలు/Fun-Facts-11.
1. అబ్రహాం లింకన్ యొక్క దయ్యం శ్వేతసౌధం-అంటే వైట్ హౌస్ లో చాలామందికి కనిపించిందని కథలు ప్రచారంలో వున్నాయి. నెదర్లేండ్స్ రాణి శ్వేతసౌధం సందర్శంచినప్పుడు ఆమెకి, ఎలియనార్ రూజ్వెల్ట్ యొక్క పరిచారికకి ఆయన దెయ్యం కనిపించిందట. లింకన్ జీవితచరిత్ర పరిశీలిస్తే, ఆయన ఇటువంటి ఆధ్యాత్మిక(psychic) విషయాలగురించి, వారు అమెరికా అధ్యక్షులుగావుండగా, తీవ్రపరిశోధనలు చేసేవారట! ఆ సందర్భంలో వారు శ్వేతసౌధంలో మరణించినవారి జీవాత్మలతో మాట్లాడడానికి “సభలని”(Seances—సే-ఆన్సెస్ లని) నిర్వహించేవారట.
2. సముద్రాలలో ఓడల ప్రయాణ వేగాన్ని నాటికల్ కొలతతో తెలుసుకుంటారు. 16 వ శతాబ్ది నావికులు బాగాపొడవైన గట్టి మోకులని(లావుపాటిగట్టిత్రాళ్ళు) సమానదూరంలో ముడులు-అంటేఆంగ్లంలో నాట్స్ (knots) వేసి సముద్ర జలంలో వదులుతూండేవారు.ఆ సందర్భంలో ఒక సమయవ్యవధిలో ఎన్నిముడులు నీటిలోకివెళ్ళేవోలెక్కించి దానిని అనుసరించి వాళ్ళఓడవేగం సుమారుగా లెక్కకట్టేవారు.
ఆ విధంగా nautical measure of speed మనకి అనుభవంలోకి వచ్చింది.
3. హంగెరీ దేశానికిచెందిన కరోలీ టకాక్స్ (Karoly Takacs) విలక్షణమైన షూటింగు ఆటగాడు.ఈ ఆటగాళ్ళని మార్క్స్ మెన్ అంటే Marksmen అనికూడా అంటారు. ఈ క్రీడలో అతడు ఒలింపిక్ ఛాంపియన్ ! తన కుడిచేతితో షూటింగ్ చేసేవాడు. దురదృష్టవశాత్తు, 1938లో ఒక గ్రెనేడ్ ప్రేలుడులో తన కుడిచేతిని పోగొట్టుకున్నాడు. అతడు పట్టుదలగా తన ఎడమచేతితో షూటింగు సాధనని తీవ్రంగాచేసి, 1948 &1952 ఒలింపిక్సుపోటీలలో రేపిడ్ ఫైర్ పిస్టల్ షూటింగ్ విభాగంలో బంగారు పతకాలు సాధించి హంగెరీ అంతర్జాతీయగౌరవాన్ని ఇనుమడింపచేసేడు.
స్వస్తి||
మానవ మేథస్సుకి అందని శ్వేత సౌధంలో లింకన్ ఆత్మకి సంబంధించిన విషయాల్తో బాటు, మానవ మేథస్సుతో సాధించిన ఓడ వేగం లెక్కగట్టడమూ, మనిషికి పట్టుదలే ఉంటే కుడి ఎడమల భేదం లేదు అని తెలియచేసిన హంగేరీ ఆటగాడి విషయాలూ చాలా ఆసక్తి దాయకంగా ఉన్నాయి.