సకారేణ తు వక్తవ్యం గోత్రం సర్వత్ర ధీమతా

స=కలిగిన, కూడుకున్న, చేరిన, కలిసి యున్న మొదలైన అర్థాలు చెప్పాలి.

సకారేణ తు వక్తవ్యం గోత్రం సర్వత్ర ధీమతా“||

అని కాశీనాథోపాధ్యాయులవారి ‘ధర్మసింధువు’లోను,  కమలాకరభట్టులవారి ‘నిర్ణయసింధువు’లోను విశదం చేయబడింది. “యథా కాశ్యపసగోత్రేతి” అని, “పరాశరస గోత్రస్య వృద్ధస్య తు మహాత్మనః” అని

నిర్ణయసింధువులో సోదాహరణంగా వివరింౘబడింది.  ఇది పితృకార్యసందర్భంలో చెప్పబడినందువల్ల ఒక్క పితృకార్యంలోనే ఇలాచెప్పాలేమో అని శంకించక్కరలేదు.

“సర్వత్ర” అన్నారుకనుక అన్నిచోట్ల అనుకోవచ్చు. పితృకార్య సందర్భంలో వివరించబడిందికనుక “సర్వత్ర” అన్నమాట పితృకార్యాలన్నింటిలోను అని మాత్రమే భావించవలసిన అగత్యం
లేదు. ఎందువల్లనంటే ఈ రెండు గ్రంథాలలోను మరొకచోట మరొకవిధంగా చెప్పినట్లు నాకు జ్ఞప్తి ఏ మాత్రమూ లేదు. పితృకార్యాలలో సకారం అంత విధిగా ఎందుకుచెప్పాలో ని.సిం.స్పష్టం చేసింది.

సకారః కుతపో జ్ఞేయః
తస్మాద్యత్నేన తం వదేత్ “||

సకారం కుతపం అని గ్రహించాలి. అందువల్ల సప్రయత్నంగా సకారాన్ని ఉచ్చరించాలి. “కుతపం” అంటే పగలు ఉండే 15 ముహూర్తాలలో మధ్యస్థమైన 8వ ముహూర్తం. ప్రాతఃకాలం, సంగవకాలం, మధ్యాహ్నం, ఈ మూడూ దాటిన పితృదేవతార్చనా సంబంధిఐన అపరాహ్ణకాలాని ఆరంభమైన ముహూర్తం కుతపం. ఇది పితృదేవతా ప్రీతి సముపార్జన హేతు సమయం.
1.రౌద్రం,2.శ్వేతం,3.మైత్రం,4.సారభటం,5.సావిత్రం,6.వైశ్వదేవం,7.గాంధర్వం,8.కుతపం,9.రోహిణం,10.తిలకం,11.విభవం,12.నిరృతి,13.జయం,14.శంబరం,15.విజయం.

అని 15 ముహూర్తాలు ని.సిం.లో చెప్పబడ్డాయి.

సకారప్రయోగానికి అనుబంధం:

వాచస్పత్యకారుడు ఈ విషయంలో  ఈ విధంగా అన్నారు:
(సకారస్య ప్రయోగే) (“స”) పూర్వ పదస్థః|
సహార్థే సమానార్థే చ యథా సషిక్త సరూప ఇత్యాది||

(సకారప్రయోగంలో, “స”) పూర్వపదం(prefix) గా ప్రయోగింపబడుతుంది. తడుపబడిన/స్నానము చేయబడిన, రూపముకలిగిన వంటి ప్రయోగాలు ఉదహరింౘబడ్డాయి.

అంటే “స” గోత్రశబ్దానికి పూర్వోపపదం(prefix)గా ఉంటుంది. అంతేకాని గోత్ర ఋషి నామధేయానికి ఉత్తర ఉపపదం(suffix)గా కాదు. అంటే వ్యాకరణానుసారంగా సగోత్రః అని ఉంటుంది.

ఉదాహరణ:
కాశ్యప + సగోత్రః అన్నది సాధుప్రయోగం.
కాశ్యపస + గోత్రః అసాధువు.
మిగిలినది లోకవ్యవహారంగానే పరిగణించాలి.

సకారప్రయోగం గురించి ప్రథమప్రేషణానికి అనుబంధ ప్రేషణానికి ఉన్న బాహ్య వైరుధ్యానికి (paradox) ఈ విధంగా సమన్వయం సాధించవచ్చు.

పితృకార్యాలలో గోత్రర్షి నామంతో (కాశ్యపస) అని ప్రయోగాంచాలి. ఎందుకంటే అక్కడ “స”కారం ప్రత్యేక ప్రతిపత్తి కలిగి “కుతప” సంజ్ఞక పావిత్ర్యసామర్థ్యయుతితో భాసిస్తోంది. అందువల్ల పితృకార్యాల్లో

అదే వినియోగం అని ఆర్షవ్యవస్థ.

మిగిలిన అన్ని సందర్భాలలో వ్యాకరణశాసనం అనుల్లంఘనీయం, ఆచరణీయ మూను!

స్వస్తి.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *