Fun facts – 2

శ్రీశారదా దయా చన్ద్రికా:—
01–07–2017; శనివారం.

వాస్తవాలు—వినోదాలు——2.

ఈ వారం ఈ శీర్షికలో కొన్ని అంశాలు పరికిద్దాం!

1. మన ఈ వర్తమానకాలంలో మనకి విచిత్రంగా అనిపింౘవచ్చు. మన అత్యాధునిక సమాచారమాధ్యమాల ద్వారా క్షణాలలోనే వార్తలు-విశేషాలు దేశాంతరాలకి అలవోకగా చేరిపోతున్నాయి. 1865లో అమెరికాలో జరిగిన అబ్రహాం లింకన్ దారుణహత్య ఉదంతం ఐరోపా దేశాలకి చేరడానికి రెండు వారాలసమయం పట్టిందట!

2. వివిధరంగాలలో, వేర్వేరు కాలాలలో విశ్వవిఖ్యాతి పొందిన మహామహులైన కళాకారులు, శాస్త్రజ్ఞులు, రాజనీతిజ్ఞులు, రచయితలు మొదలైన వారెందరో “DYSLEXIA” అనే నరాల సమస్య(neurological disability in reading, writing, or spelling in a normal way) అంటే మాటలలో నత్తి వంటి సమస్యతో బాధపడేవారు. అటువంటివారిలో కొందరు: లియొనార్డో దా వించి, ఆల్బర్ట్ ఐన్ స్టీన్ , విన్ స్టన్ చర్చిల్ ,థామస్ ఎడిసన్ , జనరల్ జార్జ్ పేటన్ , జిమ్మీ గ్రీవ్స్ , సుసాన్ హేంప్ షైర్ ,మొదలైనవారు.

3. అమెరికా అధ్యక్షుడు హేరీ ట్రూమన్ ఒకసారి శ్వేతసౌధం (వైట్ హౌస్ )లో తనభార్య వారిద్దరు పూర్వం వ్రాసుకున్నప్రేమలేఖలు కాల్చివేస్తూండగా చూసి “అయ్యో! డార్లింగ్ ! ఏం పనిచేస్తున్నావు? చరిత్రగురించి ఆలోచించేవా”? అనాన్నాడట, ఆదుర్దాతో! “బాగా ఆలోచించేకానే ఈ నిర్ణయం తీసుకున్నాను” అని ఆమె నిదానంగా సమాధానంచెప్పేరుట!

(సశేషం).

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *