సాహిత్యము సౌహిత్యము – 10 : అంభోధిః జలధిః పయోధిరుధధిః వారాన్నిధిర్వారిధిః
14–07–2017, శనివారం, 6–20AM.
ఈ శీర్షికలో యింతవరకు తెలుగు వాఙ్మయంలో ప్రసిద్ధమైన సీసపద్యాలలో వున్న కొన్ని ప్రహేళికలని పరికించి, చర్చించుకుని అంతో-ఇంతో వినోదంతోపాటు, కాస్తంత విషయసేకరణచేసి ముందుకి
ఈ వారంనించి “సమస్య” అనే ప్రక్రియని ఎంత సమయస్ఫూర్తితో, అయత్నసిద్ధంగా, ప్రశంసాపాత్రంగా, విజ్ఞాన-వినోదదాయకంగా ప్రతిభావంతులైన కవులు ఆయా దేశ-కాలాలలో నిర్వహించేరో చూద్దాం! అష్ట/శత/సహస్ర అవధానాలలో సమస్య చాలా ప్రత్యేకస్థానం వుంది. “దత్తపది”, “ఆశువు”, “అప్రస్తుత ప్రశంస” వంటి గొప్ప-గొప్ప అంశాలెన్నివున్నా, సమస్య “సమస్యే”!
మనం ఈ “సాహిత్యము-సౌహిత్యము” శీర్షికని “మృగాత్ సింహః పలాయనం” అనే సంస్కృత సమస్య పూరణం మనంచూచేం! ఇక్కడ ఒకవిషయం ప్రస్తావించాలి.
ఈ మొట్టమొదటి సమస్యాపూరణ విషయానికి నా ప్రాణసఖుడు, మన ఈ కుటుంబసభ్యుడు, సరస హృదయుడు, ఇటువంటి ఉన్నత శ్రేణివిషయాలకోసం తన ప్రాణాన్ని అలవోకగా యిచ్చేటంత గాఢశీలత
ఈ వారం సమస్యాపూరణం సంస్కృత సమస్యతో ఆరంభిద్దాం.
సమస్య:
“అంభోధిః జలధిః పయోధిరుధధిః వారాన్నిధిర్వారిధిః”||
ఈ సమస్యలో ఆరు మాటలున్నాయి.
1.అంభోధి; 2.జలధి; 3.పయోధి ; 4.ఉదధి; 5.వారాంనిధి లేక వారాన్నిధి; 6.వారిధి.
సంస్కృతంలో “ధిః” అనే ప్రత్యయానికి (terminator or suffix అని ఇక్కడ అర్థం) ఆశ్రయస్థానం, కలిగివుండే చోటు,పాత్ర మొదలైన అనేక అర్థాలు వున్నాయి.
ఈ ఆరుమాటలలో ముందున్న ‘అంభః’,’జల’, ‘పయః’, ‘ఉద’, ‘వారాం’, ‘వారి’ అన్న శబ్దాలన్నింటికి “నీరు” అనే అర్థం. అందువలన ఈ ఆరు మాటలకి “సముద్రం” అనే ఒకేఒక్క అర్థం తప్ప వేరే అర్థం రాదు. అంటే ఆరుమార్లు సముద్రం అనే అర్థం వచ్చే శార్దూల విక్రీడితం ఛందస్సులోవున్న శ్లోక పాదానికి అనుగుణమైన సమస్యా పూరణం చెయ్యాలన్నమాట! దీనికి కవిగారు ఎంత అందమైన శ్లోకం చెప్పేరో గమనిద్దాం:
“అంబా కుప్యతి తాత! మూర్ధ్ని విలసత్ గంగేయముత్సృజ్యతాం
విద్వన్ ! షణ్ముఖ! కా గతిః మయి చిరాత్ అస్యాః స్థితాయాః వద|
రోషావేశవశాత్ అశేష వదనైః ప్రత్యుత్తరం దత్తవాన్
అంభోధిః జలధిః పయోధిరుధధిః వారాన్నిధిః వారిధిః” ||
“కుమారస్వామి తనతండ్రి శివుడి దగ్గరకి వెళ్ళి యిలా అన్నాడు:
స్వస్తి|| (సశేషం)
‘సాహిత్యంలో చమత్కారాలు’ లాంటి పేర్లు పెట్టకుండా ‘సౌహిత్యము’ అని మంచి పేరు పెట్టేవు.
ప్రతిభావంతులైన అవథానులే కాదు , అద్భుతమైన సమస్యలివ్వగలిగిన పృచ్ఛకులూ ఉండేవారు.
కనకనే ఇంతటి గొప్ప శ్లోకాలు పుట్టుకొచ్చాయి. వాటిని వెలికితీసి, వివరణాత్మకమైన విశ్లేషణ చేస్తూన్నందుకు నీకు ధన్యవాదాలు.
ఈ శ్లో కంలో కుమారస్వామి మాతృప్రేమతో పాటు కోపంలోఉన్నవ్యక్తి ఒకే మాటని నొక్కినొక్కి అనేకసార్లు అనే సహజలక్షణం బాగా అర్థమైంది
చాలా బావుంది.