సంగీతం—నాదవేదం—50

12—06—2021; శనివారం.

శంకరాభరణం రాగంలో శ్యామాశాస్త్రిగారి రచనల ఎత్తుగడలు ఇప్పుడు పరిచయం చేసుకుందాం:— “దేవి! మీననేత్రి! బ్రోవ — రావె! దయచేయవె! బ్రోవరావమ్మా! ॥దేవి!॥ (ఆదితాళం); సరోజదళనేత్రి! హిమగిరిపుత్రి! నీ పదాంబుజములే — సదా నమ్మినానమ్మా! శుభమిమ్మా! శ్రీమీనాక్షమ్మా! ॥సరోజదళనేత్రి!॥ (ఆదితాళం); నన్ను కరుణించి బ్రోవు – – – (ఏకతాళం)” మొదలైన కృతులు ఇప్పుడు లభ్యం ఔతున్నాయి.

శంకరాభరణరాగంలో స్వరరచన చేయబడిన స్వాతితిరునాళ్ మహారాజా వారి కృతుల ఎత్తుగడలు ఇప్పుడు పరిచయం చేసుకుందాం:— “అహో చిత్త! చిన్తయ కిన్తయా హన్త! తే విషయేషు ॥అహో॥ (మిశ్రచాపుతాళం); భక్తపరాయణ! మామవానంతపద్మనాభ! సతతం ॥భక్తపరాయణ!॥ (మిశ్రచాపుతాళం); ॰{తానవర్ణం — చలమేలజేసేవురా! సరసకు రార! నా సామి! ॥చలమేల॥ (ఖండ అటతాళం)}॰; దేవి! జగజ్జనని! దేహి కృపయా మమ తావక చరణయుగ భక్తిం ॥దేవి!॥ (ఆదితాళం); ॰{మణిప్రవాళ పదవర్ణం — ఇందుముఖి! నిశమ్య ఎన్నళల్ నీ శమయ (ఖండ అటతాళం)}॰; కలయే పార్వతీనాథం కరుణావాసం ॥కలయే॥ (మిశ్రచాపుతాళం); నృత్యతి నృత్యతి సాంబశివో ధృక్ట్ — తోం, ధృక్ట్ తోం, ధృక్ట్ తోం, ధృక్ట్ తోమితి ॥నృత్యతి॥ (ఆదితాళం); రాజీవాక్ష! బారో! కృష్ణ! రాధారమణ! బారో! ॥రాజీవాక్ష॥ (కన్నడం — ఆదితాళం); ॰{మణిప్రవాళ పదం — సఖి! హే! నీ గమిక్క వేగం సరసనోడు – సకలం మే కథయ శోకం ॥సఖి!॥ (మిశ్రచాపుతాళం)}॰; ॰{తెలుగు పదం — సామి! నీ పొందు కోరియుండిన నాపై జాలమేల జేసేవురా! ॥సామి!॥ (మిశ్రచాపుతాళం)}॰; ॰{మణిప్రవాళ పదం — శారదవిధువదననాం మత్ ప్రాణనాథన్-చాలవేయోరునాళ్ నిశి వన్నరికిల్ ॥శారదవిధువదననాం॥ (ఆదితాళం)}॰; ॰{సంస్కృతపదం — సారసనాభ! మే సాధు శృణు వచనం ॥సారసనాభ!॥ (ఆదితాళం)}॰; సారసభవసేవిత! పదయుగళామల — హిమకర సువదన సరసిజనాభ మామవ ॥సారసభవసేవిత!॥ (ఆదితాళం); ॰{స్వరజతి — సా రి స ని ధ ప (త్రిస్ర ఏక తాళం)}॰” మొదలైన రచనలు శంకరాభరణంలో కూర్చబడి ఉన్నాయి.

సర్వశ్రీ అంబుజం కృష్ణ, అరుణాచలకవి, గర్భపురివాస, గోపాలకృష్ణభారతి, కనకదాసరు, కవికుంజరభారతి, క్షేత్రయ్య, మునిపల్లె సుబ్రహ్మణ్యకవి, హరికేశ నల్లూరు ముత్తయ్య భాగవతర్, నీలకంఠశివన్, పల్లవి దొరస్వామి ఐయర్, పాపనాశం శివన్, పట్నం సుబ్రమణియ అయ్యర్, పెరియసామి తూరన్, పొన్నయ్యాపిళ్ళై, పురందరదాసరు, మాయూరం విశ్వనాథ శాస్త్రి, శాహాజీ మహారాజా, శ్రీపాదరాయరు, ఉపనిషద్ బ్రహ్మయోగి, మైసూర్ వాసుదేవాచార్య, లక్ష్మణన్ పిళ్ళై, వేదనాయకం పిళ్ళై, వాలాజాపేట వేంకటరమణ భాగవతులు మొదలైన అనేక సువిఖ్యాత వాగ్గేయకారులు శంకరాభరణరాగంలో తమ రచనలని దీపింపజేసేరు.

(సశేషం)

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *