సంగీతం—నాదవేదం—73
20—11—2021; శనివారము
ॐ
ఇప్పుడు వివాదిస్వరమేళకర్తలైన 40 రాగాలేవో తెలుసుకుందాం. 1వ చక్రం లోని ఆరు మేళకర్త రాగాలు, అలాగే ఆరవ చక్రంలోని ఆరు మేళకర్త రాగాలు, అదేవిధంగా 7వ, 12వ చక్రాలలోని 6+6=12 మేళకర్త రాగాలు, అంటే, మొత్తం 6×4=24 మేళకర్త రాగాలూకూడా వివాదిస్వర మేళకర్త రాగాలే! ఇవి మాత్రమే కాక, 2వ, 3వ, 4వ, 5వ, 8వ, 9వ, 10వ, 11వ చక్రాలలోని (అంటే ఈ 8 చక్రాల లో ఉన్న)మొదటి-చివరి మేళకర్త రాగాలు అన్నీ కూడా) వివాదిస్వర మేళకర్తలే! అంటే 8 చక్రాలలోని రెండేసి రాగాలు, అంటే, 8×2=16 కూడా వివాది మేళాలు. అంటే, ముందు మనం గణించిన 24 మేళకర్తలు, ఇప్పుడు గమనించిన 16 మేళకర్త కలిపితే 40 రాగాలు వివాదిస్వర మేళాలుగా లెక్కకి వస్తాయి. అందువలన 72—40=32 మేళకర్తలు మాత్రమే వాదిస్వరాలు అని తేలింది. వివాదిస్వరమేళకర్తల గురించిన మిగిలిన సాంకేతికవివరాలు ఆచార్యవర్యుల సమక్షంలో తెలుసుకోవాలి. అవి అన్నీ ఇక్కడ వివరించడం వలన గ్రంథం పెరిగిపోతుంది. మన ప్రస్తుత శీర్షిక శాస్త్ర ప్రాథమిక పరిచయంకోసం ఉద్దేశించబడింది. The main aim of the series of these essays is to provide “An Informal Introduction to our Indian Music” in order to help those who are interested in obtaining a reasonable knowledge of our ancient art and science of music in an informal way and to become better connoisseurs of our great traditional art-form. దీనితో రాగశాస్త్రపరిచయం పూర్తి ఐనట్లే!
ఇంక తాళాధ్యాయం ఒక్కటీ సంక్షిప్తంగా పరిచయం చేసుకుంటే మన ఈ వ్యాసపరంపరద్వారా శాఖాచంద్రన్యాయవిధానంగా అధ్యయంనం చేయగలిగిన దక్షిణభారత సంగీతశాస్త్ర పరిచయం పూర్తి అయిపోతుంది. ఆ వెనుక ఉత్తరభారత సంగీతశాస్త్ర పరిచయాన్ని కూడా ఇదేవిధంగా కొనసాగించుకుందాం!
(సశేషం)॥