సంగీతం—నాదవేదం—49
05—06—2021; శనివారం
ॐ
శంకరాభరణ రాగంలో భద్రాచల రామదాసుగారి కీర్తనలు ఇప్పుడు తెలుసుకుందాం:— “ఇతరములెరుగనయ్యా, నా గతి నీవే రామయ్యా! — సతతము సీతాపతి నీవే యని, మతి నమ్మితి, సద్గతి చెందింపుము ॥ఇతరములెరుగనయ్యా॥ (ఏకతాళం); రక్షింపవిది యేమో రాచకార్యము పుట్టె, రామచంద్రా! — నన్ను రక్షింపకున్నను రక్షకులెవరింక? రామచంద్రా! ॥రక్షింపవిది యేమో॥ (రూపకతాళం); తగునయ్య? దశరథ రామచంద్ర! దయ తలచవేమి? నీకు — పగవాడనా? యెంతో బతిమాలినగాని పల్కవేమి? ॥తగునయ్య?॥ (రూపకతాళం); ధనము చూచినంత తబ్బిబ్బులాయెను తానీషాకును — కనువిచ్చి గర్జింప కక్కసమాయె శ్రీరామునకును ॥ధనము॥ (రూపకతాళం)” మొదలైన కీర్తనలు ఈ రాగంలో లభ్యం ఔతున్నాయి.
ముద్దు(త్తు)స్వామి దీక్షితులువారి శంకరాభరణరాగ కృతుల పరిచయం ఇప్పుడు చేసుకుందాం:— “అక్షయలింగవిభో! స్వయంభో! — అఖిలాండకోటి ప్రభో! పాహి శంభో! ॥అక్షయలింగవిభో!॥ (మిశ్రచాపుతాళం); ఆంజనేయం సదా భావయామి — అప్రమేయం ముదా చింతయామి ॥ఆంజనేయం॥ (త్రిస్ర ఏక తాళం); బృహదీశ్వరాయ నమస్తే — బ్రహ్మానందాయ బలేశ్వరాయ ॥బృహదీశ్వరాయ॥ (ఆదితాళం); చింతయేsహం సదా చిత్సభానాయకం — చింతితార్థదాయకం జీవేశ్వర భేదాపహం ॥చింతయేsహం॥ (చతురస్ర ఏక తాళం); దక్షిణామూర్తే! విదళిత దాసార్తే! — చిదానందపూర్తే! సదా మౌనకీర్తే! ॥దక్షిణామూర్తే!॥ (మిశ్రఝంపతాళం); దాశరథే! దీనదయానిధే! —దానవభీకర దామోదర! ॥దాశరథే!॥ (త్రిస్ర ఏక తాళం); దీనబంధో! దయాసింధో! ధీమణే! మే ముదం సదా దేహి ॥దీనబంధో॥ (త్రిస్ర ఏక తాళం); గిరిజయా అజయా అభయాంబికయా — గిరీశ జాయయా రిక్షితోsహం ॥గిరిజయా॥ (ఆదితాళం); గురుగుహ పదపంకజమతిగుప్తమనిశమాశ్రయే (త్రిస్ర ఏక తాళం); గురుగుహ సరసిజ కరపద శుభకరమూర్తే (చతురస్ర ఏక తాళం); గురుమూర్తే! బహుకీర్తే! — సురసేనాధిపతే శ్రీ ॥గురుమూర్తే!॥ (త్రిస్ర ఏక తాళం); హే మాయే! మాం బాధితుం కా హి త్వం కా హి యాహి, యాహి (త్రిస్ర ఏక తాళం); జగదీశ! గురుగుహ! హరి విధి వినుతం (చతురస్ర ఏక తాళం); కమలాసన వందిత పాదాబ్జే! — కమనీయ కరోదయ సామ్రాజ్యే! (చతురస్ర ఏక తాళం); కాంచీశం ఏకామ్రనాయకం నిత్యమహం భజే (త్రిస్ర ఏక తాళం); మాయే! చిత్కలే! జయరమే! మంగళకర రంగరమణి (చతురస్ర ఏక తాళం – త్రిస్రగతి); ముచికుంద వరద! త్యాగరాజ సుందర కర! (త్రిస్ర ఏక తాళం); నాగలింగం భజేsహం అ – నాదిలింగం భజేsహం శ్రీ ॥నాగలింగం॥ (రూపకతాళం); పంకజముఖ! శంకరహిత! సంకటహర! వేంకటగిరి – వాస! (రూపకతాళం); పర – దేవతే! భక్తమోదిని! పాహి మాం (రూపకతాళం); పవనాత్మజం భజ రే చిత్త! — పరమశాంతం సుర గురుగుహ మహితం ॥పవనాత్మజం॥ (ఆదితాళం); పాహి దుర్గే! భక్తిం దేహి (చతురస్ర ఏక తాళం); పాహి మాం జానకీవల్లభ! (త్రిస్ర ఏక తాళం); పార్వతీపతే! పాలయాశు శంభో! (చతురస్ర ఏక తాళం); పీతవర్ణం భజే భైరవం (త్రిస్ర ఏక తాళం); రాజీవలోచనం రామచంద్రం (త్రిస్ర ఏక తాళం); రామచంద్రం రాజీవాక్షం శ్యామలాంగం (చతురస్ర ఏక తాళం); రామజనార్దన! రావణమర్దన! (త్రిస్ర ఏక తాళం); శక్తిసహిత గణపతిం శంకరాది సేవితం (త్రిస్ర ఏక తాళం); శంకరవర! పంకజకర! (రూపకతాళం); శౌరి విధి నుతే! శాంభవి! లలితే! (చతురస్ర ఏక తాళం); శ్రీకమలాంబికాయా కటాక్షితోsహం — సచ్చిదానంద పరిపూర్ణ బ్రహ్మాsస్మి ॥శ్రీకమలాంబికాయా॥ (రూపకతాళం); శ్రీవేణుగోపాలం భజ మానస! సతతం — దేవేంద్రపూజితం దివ్యరత్నభూషితం ॥శ్రీవేణుగోపాలం॥ (రూపకతాళం); శ్యామలే! మీనాక్షి! సుందరేశ్వరసాక్షి! (చతురస్ర ఏక తాళం); సదాశివజాయే! విజయే! (చతురస్ర ఏక తాళం); సదాశివముపాస్మహే శం ముదా — చిదానందరూపం సదా ముదా ॥సదాశివం॥ (ఆదితాళం); సకలసురవినుత! శంభో! స్వామిన్! (చతురస్ర ఏక తాళం); సంతతం గోవిందరాజం సదా వందిత నారదమునిబృందం (త్రిస్ర ఏక తాళం); సంతతం పాహి మాం సంగీతశ్యామలే! (త్రిస్ర ఏక తాళం); సంతాన సౌభాగ్యలక్ష్మీకలత్రం (త్రిస్ర ఏక తాళం); సామగానప్రియే! కామకోటినిలయే! (త్రిస్ర ఏక తాళం); సుందరేశ్వరాయ నమస్తే — సదానందాయ సోమాయ ॥సుందరేశ్వరాయ॥ (రూపకతాళం); సుబ్రహ్మణ్యం సురసేవ్యాబ్జపదం (చతురస్ర ఏక తాళం); సోమాస్కందం స్వానందకందం (త్రిస్ర ఏక తాళం); తారకేశ్వర! దయానిధే! మాం — తారయాశు కరుణానిధే! శ్రీ ॥తారకేశ్వర!॥ (ఆదితాళం); వందే మీనాక్షి! త్వాం (చతురస్ర ఏక తాళం); వరదరాజ! పాహి విభో! (త్రిస్ర ఏక తాళం); వరశివబాలం వల్లీలోలం వందే! వందే (చతురస్ర ఏక తాళం); వాగ్దేవి! మామవ కల్యాణి! వాణి! బ్రహ్మాణి! (చతురస్ర ఏక తాళం)” అనే అమూల్య అలౌకిక సంగీత శాశ్వత సంపదని దీక్షితస్వామి శంకరాభరణరాగంలో మనకి అందించేరు.
(సశేషం)