సంగీతం—నాదవేదం—48
29—05—2021; శనివారము.
ॐ
త్యాగరాజస్వామివారు 29వ మేళకర్త రాగజన్యమైన శంకరాభరణరాగంలో అనేక లోకోత్తర కృతులని రచంచేరు. వాటి పల్లవిలని ఇప్పుడు పరిచయం చేసుకుందాం:—
“ఈవరకు జూచినది చాలదా — యింక నా రీతియా ॥ఈవరకు॥ (ఆదితాళం); ఎదుట నిలిచితే నీదుసొమ్ము లేమి పోవురా? ॥ఎదుట॥ (ఆదితాళం); ఎందు కీ చలము? నే నెవరితో తెల్పుదు? ॥ఎందు కీ॥ (త్రిపుటతాళం); ఎందుకు పెద్దలవలె బుద్ధీయవు? ఎందు పోదునయ్య? రామయ్య! ॥ఎందుకు॥ (దేశాదితాళం); ఏమి నేరమో, నన్ను బ్రోవ ఎంత భారమో నా వల్ల ॥ఏమి॥ (ఆదితాళం); గత మోహాశ్రితపాలాద్భుత సీతారమణ! ॥గత॥ (రూపకతాళం); నన్ను బ్రోవకను విడువనురా రామ! ॥నన్ను॥ (చాపుతాళం); నా పాలి శ్రీరామ! భూపాలక స్తోమ! — కాపాడ సమయము, నీ పాదము లీరా! ॥నా పాలి॥ (ఆదితాళం)—>(నలుగుపాట); పరిపాలయ! దాశరథే! మాం — పరిపాలయ! దాశరథే! (చాపుతాళం); పాహి రామచంద్ర! పాలితసురేంద్ర! — పరమపావన! సద్గుణసాంద్ర! ॥పాహి॥ (ఆదితాళం); బుద్ధిరాదు బుద్ధిరాదు — పెద్దల సుద్దులు వినక ॥బుద్ధిరాదు॥ (చాపుతాళం); భక్తిబిచ్చ మీయవే! — భావుకమగు సాత్విక ॥భక్తి॥ (రూపకతాళం); మనసు స్వాధీనమైన ఆ ఘనునికి — మరి మంత్ర-తంత్రములేల? ॥మనసు॥ (రూపకతాళం); మరియాద కాదు రా ॥మరియాద॥ (ఆదితాళం); రమారమణ! రారా, ఓ ॥రమారమణ॥ (ఆదితాళం); రామ! నిను వినా నను రక్షింప నొలులగాన ॥రామ!॥ (రూపకతాళం); రామ! శ్రీరామ! లాలి ॥రామ!॥ (జోలపాట)—(ఆదితాళం); రామ! సీతారామ! రామ! – రామ! సీతారామ! రామ! — రామ! సీతారామ! రామ! – రామ! సీతారామ! రామ! ॥రామ!॥ (ఆదితాళం); వరలీల! గానలోల! సురపాల! సుగుణజాల! భరితనీలగళ — హృదయాలయ! శ్రుతిమూల! సుకరుణాలవాల! పాలయాశు, మాం ॥వరలీల!॥ (త్రిశ్రలఘు తాళం); వల్ల కాదనక సీతావల్లభ! బ్రోవు, నా ॥వల్ల॥ (రూపకతాళం); విష్ణువాహనుండిదే – వెడలె చూడరే! ॥విష్ణు॥ (రూపకతాళం); శంభో! శివ! శంకర! గురు అంభోరుహనయన! ॥శంభో!॥ (రూపకతాళం); శ్రీరఘువర! దాశరథే! రాం ॥శ్రీ॥ (రూపకతాళం); సీతాకల్యాణ వైభోగమే! రామకల్యాణ వైభోగమే! ॥సీతాకల్యాణ॥ (ఖండలఘువు తాళం); సుందరేశ్వరుని జూచి – సురుల జూడ మనసు వచ్చునా ॥సుందరేశ్వరుని॥ ( ఆదితాళం); స్వరరాగ సుధారస యుత భక్తే – స్వర్గాపవర్గము రా! మనసా! ॥స్వరరాగ॥ (ఆదితాళం); ఏవిధములనైన (ఎవ్విధములనైన) గాని న – న్నేలుకో! మనసురాదా? రామ! (ఆదితాళం); రంగనాయక! రక్షింపుమయ్య! – రచ్చ సేయనేల? రఘువంశనాథ! (ఆదితాళం); సారసనేత్రాపార గుణ! – సామజశిక్ష! గోద్ధరణ! ॥సారస॥ (ఆదితాళం); సీతాపతి! కావవయ్య ॥సీతాపతి!॥ (ఆదితాళం); శంకరగురువరుల (ఆదితాళం)” అను ఈ కృతులు మనకు ఇప్పుడు లభ్యం అవుతున్నాయి.
(సశేషం)