Fun facts – 26

శ్రీశారదా దయా చంద్రికా :—
16—12—2017; శనివారము.

వాస్తవాలు—వినోదాలు~26.

1. పశ్చిమ జర్మనీలోని 20 సంవత్సరాల పీటర్ లెఞ్జ్ , దేశ సైన్య వ్యవస్థ నుంచి వచ్చిన పిలుపునుండి ఎలాగో ఒకలాగ బయటపడడానికి ప్రయత్నం చేయసేడు. అతడి గర్ల్ ఫ్రెండ్ డయబెటిక్ అని తెలుసు. ఆమె యూరిన్ సేంపిల్ ని ప్రభుత్వ ఆసుపత్రికి పంపించేడు. ఆ దెబ్బతో హాయిగా బయటపడిపోవచ్చని కలలు కన్నాడు. ఒకవారం తరవాత సైన్యకార్యాలయం, రిక్రూట్మెంట్ శాఖ నుంచి పిలుపు వచ్చింది, పీటర్ కి.అక్కడ అతడికి ఆ శాఖాధికారి, జాయినింగు తేదీవుత్తరువులని అందించేడు. అంతేకాకుండా తమ  విభాగంలో మొట్టమొదటి గర్భవంతుడైన సైనికుడు చేరుతున్నందుకు, పీటర్ కి, అభినందనలు అందించేడు.

2. డా. సేమ్యుయెల్ ఉఫాం పేరుపొందిన గొప్ప పండితుడు, వాక్చాతుర్యంలో అసాధారణప్రజ్ఞ కలవాడు. వృద్ధాప్యంవల్ల మంచంమీద వున్నాడు. చివరి గడియలు వచ్చేసేయి. ఏమీ కదలికకూడా లేదు. మరణించేడోలేదో తెలియడంలేదు. మంౘంచుట్టూచేరిన బంధు,మిత్ర,అభిమానబృందంలోంచి ఒక పెద్దాయన ఇలా అన్నాడు: “అరికాళ్ళు తడిమిచూడండి. ౘనిపోతే అవి వేడిగావుండవు”! వెంటనే డా.ఉఫాం, ఒక కన్ను తెరిచి ఇలా అన్నాడు: “అబ్బే! అలాగేమీ చెప్పలేం. జోన్ ఆఫ్ ఆర్క్ విషయంలో అరికాళ్ళు ౘల్లబడలేదు” అంటూ సన్నగా నవ్వేసేడు. అవే ఆయన ఆఖరి మాటలు.

3. ఇంచుమించు ఇలాంటి ఉదంతమే మరొకటివుంది. ఫ్రెంచిభాష వ్యాకరణవేత్త Dominique Bonhours కూడా పెద్దవాడైపోయేడు. మరణశయ్య మీదవున్నాడు. పైగా పూర్తిగా స్పృహలోవున్నాడు. శిష్యోపశిష్యులందరూ మంౘంచుట్టూ మూగేరు. అంతిమసందేశం ఏం చెపుతారోనని అందరూ ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. తలకి ఇటు-అటు వున్నవాళ్ళని దగ్గరకి ఒంగమని సంజ్ఞచేసేరు-గురువర్యులు. వినయ,విధేయతలతో శిష్యులు గురువుగారి ముఖంమీదికివంగి, తమ-తమ చెవులు వారినోటికి అందుబాటులో పెట్టేరు. గురువుగారు మంత్రోపదేశం ఇలాగ చేసేరు:
“I am about to — or I am going to — die; either expression is  used.” ఇదే వారి అంతిమ సందేశం.

ఇంతవరకు శ్రీశారదామాత అనుగ్రహంతో, “వాస్తవాలు—వినోదాలు”/”Fun-Facts” మీ అందరి ప్రత్యక్ష/పరోక్ష సహాయ-సహకారాలతో 26 వారాలు, అంటే సుమారు 6 నెలలు నిరాఘాటంగా నిర్వహింౘడం జరిగింది. ప్రస్తుతానికి ఈ శీర్షిక ఇంతటితో ముగిసింది. అందరికి హార్ద ధన్యవాదాలు!

స్వస్తి||

You may also like...

2 Responses

  1. సి. యస్ says:

    ఓహో…. ఫినిషింగ్ టచ్ అంటారే… అలా ముగించావు ఈ వినోద వాస్తవాలు. చూడ్డానికి సరదాగా ఉంటూనే, తమ తమ అంశాల పట్ల వాళ్ళకి ఉన్న నిబద్ధత ఎంతటిదో తెలియచేస్తున్నాయి…. డా.సేమ్యుల్ ఉఫాం, డొమినిక్ బొనర్స్ ల ఉదంతాలు. పీటర్ కి సైన్య కార్యాలయ అధికారి ఇచ్చిన ‘ jolt’ అమోఘం.

  2. Kbj srinivas says:

    Why are you closing down this? Please continue as long as you can. We look at the quality rather than quantity and frequency.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *