Fun facts – 24
శ్రీశారదా దయా చంద్రికా :—
02—12—2017; శనివారము.
వాస్తవాలు—వినోదాలు/Fun-Facts~24.
1. 1671వ సంవత్సరంలో కలనల్ థామస్ బ్లడ్ , తాను ప్రీస్టునని కాపలాదారుని నమ్మించి,టవర్ ఆఫ్ లండన్ గదిలోకి కష్టపడి దొంగతనంగా ప్రవేశింౘగలిగేడు. అక్కడ రాజవంశానికి చెందిన అపురూపమైన మణులు, మాణిక్యాలు భద్రం చెయ్యబడ్డాయి. ఒక సంచీలో వాటిని దాచుకుని, కాపలావాడిని లాఘవంతో పడగొట్టి బయటపడగలిగేడు. కాని అప్పటి లండను రాజ్యరక్షకభట వ్యవస్థ సమర్థవంతమైనది కనక, దొంగ లండను టవరు దాటేలోపుగానే అతన్ని పట్టుకుని, విలువైన రత్నాలనన్నింటిని తమవశంచేసుకుని, దొంగని జైలులో పడేసేరు. విషయం అప్పటి బ్రిటిష్ ప్రభువు ఛార్లెస్ —|| కి విన్నవింౘడం ౙరిగింది. రాజుల చిత్తం, వింతలు-విడ్డూరాల పొత్తం కదా! కలనల్ బ్లడ్ చేసిన నేరాన్ని విస్మరించి, ప్రభువులు దొంగగారి దుస్సాహసాన్ని మెచ్చుకుని, ఆ నేరానికి ౘట్టంప్రకారంవున్న మరణ శిక్షని తగ్గింౘడమేకాక, ఏడాదికి 300 పౌండ్లు పింఛను సౌకర్యం కూడా ఏర్పాటుచేసేరు- “రాజు తలుచుకుంటే డబ్బులకి కొదవా!” అన్నట్టు!!!
2. HMV, Columbia, EMI, Decca, Pye పేర్లున్న గ్రామఫోను రికార్డు సంస్థలు అన్నింటికి చెందిన ఒక సమాన లక్షణంవుంది. అది ఏమిటో తెలుసా? Beatles/బీటిల్స్ యొక్క రికార్డింగు ఒప్పందాన్ని పై సంస్థలన్నీ మొదట్లో తిరస్కరించేయి. జార్జి మార్టిన్ పర్యవేక్షణలో Parlophone సంస్థవారు, బీటిల్స్ రికార్డింగు ఒప్పందాన్ని మొదటగా స్వీకరించేరట!
3. 5 అడుగుల- 10 అంగుళాల ఎత్తు వున్న అమెరికా ప్రెసిడెంట్ హేరీ ట్రూమన్ , 1945 లో Potsdam conferenceలో ఆయన చర్చిల్ ని, స్టాలిన్ ని, కలవడం జరిగింది. వారిద్దరు తనకంటె పొట్టిగావుండడం చూచి ట్రూమన్ ఆశ్చర్యపోయేరుట. అంతేకాక వారు యిలా అన్నారుట. “నాతో ఫొటోలు తీయించుకున్నప్పుడు ప్రతిసారి, ఇద్దరూ, ఒకమెట్టు పైన నిలబడడానికి ఇష్టపడేవారు”.
Samasyaa puranam chala baagundi
చేసింది నేరమే అయినా, చెయ్యడంలో ఉన్న నేర్పుని గుర్తించి మెచ్చుకున్న ఛార్లెస్ ప్రభువు రసజ్ఞత చాలా బాగుంది. పైగా
పింఛను ఇవ్వడం కొసమెరుపు. ట్రూమన్ ఎత్తు సమస్య చిత్రంగా
ఉంది