Fun facts – 23
శ్రీశారదా దయా చన్ద్రికా :—
25—11—2017; శనివారము.
వాస్తవాలు—వినోదాలు/Fun-Facts~23.
1. ఆ కాలం నాటి సుప్రసిద్ధ హాలీవుడ్ హీరోలు, ఫ్రెడ్ ఏస్టైర్ , డగ్లస్ ఫెయ్ర్ బేంక్స్ , ఫ్రేంక్ సినాట్రా, డీన్ మార్టిన్ ,క్లార్క్ గేబుల్ , కేరీ గ్రాంట్ ,బాబ్ హోప్ , వీరే కాక అమెరికా అధ్యక్ష పదవి పొందిన థామస్ జఫర్సన్ , వుడ్రో విల్సన్ , జార్జ్ వాషింగ్టన్ , వారెన్ హార్డింగ్ , వీరందరూ 10 నెంబరు షూస్ నే వాడేరు. గేరీ కూపరు వారందరికన్న నాలుగు అడుగులు ముందుకువేసి 14వ సంఖ్యవున్న పాదరక్షలు ధరించేవారు.
2. 1959 వేసవి కాలంలో అలాస్కానుంచి లండన్ ,హేంబర్గ్ నగరాలలోని ఏక్వేరియంలలో ప్రదర్శనకోసం భద్రపరౘడానికి, ఆరు అరుదైన జాతికి చెందిన పెద్ద రాకాసి పీతలని విమానాలలో తీసుకువెళ్ళడం జరిగింది. మధ్యలో పేరిస్ లోని ఆర్లీ విమానాశ్రయంలో వేరే విమానంలోకి మార్చడంకోసం విరామం వచ్చింది. విరామంలో భద్రతకోసం విమానాశ్రయం వంటవిభాగంయొక్క భవనసముదాయంలో ఒక పెద్ద వాటర్ టేంక్ లో జాగ్రత్తగా మహాకర్కాటకాలని భద్రపరిచేరు. పాకవిభాగ అధ్యక్షుడికి (షెఫ్ కి)వీటి వివరాలు ఎవరూ చెప్పలేదు. ఆ రోజు ఆ టెర్మినల్ రెస్టారెంట్ కి విచ్చేసిన విమాన ప్రయాణీకులు అదృష్టవంతులు. అరుదైన, ఆ మాటకివస్తే అలభ్యమైన పీతల సలాద్ వారికి లభించింది.
3. 1958వ సంవత్సరంలో బాల్టిమోర్ లో “హోవర్డ్ హొటెల్ ” భవన నిర్మాణం పూర్తి అయ్యింది. ౘలికాచుకోవడం కోసం పనివాళ్ళు భవనంలోని వంటగదిలో ౘలిమంట వేసుకున్నారు. మంట బాగా రాజుకోగానే పొగకి వారందరూ ఉక్కిరిబిక్కిరి ఐపోయేరు. అప్పుడుకాని వారు గమనింౘలేకపోయేరు- పొగగొట్టం- అంటే – చిమ్నీ – నిర్మించడం మరిచిపోయేరని!!!
స్వస్తి ||
పీతల సలాడ్ గమ్మత్తు గా ఉంది. మొత్తానికి fun facts సరదాగా ఉంటూనే , వాస్తవాలు కావడం గమనార్హం.