Fun facts – 21
శ్రీశారదా దయా చంద్రికా:—
11—11—2017; శనివారము.
వాస్తవాలు—వినోదాలు/ Fun-Facts~21.
1. ఇది ఒకసారి న్యుయార్కు మహానగరంలో జరిగిన సంఘటన. ఒక చిత్రకారుడికి బ్రతుకుమీద ఏవగింపు కలిగింది. ౘచ్చిపోవాలని నిర్ణయించుకున్నాడు. నగరంలోని “ఎంపైర్ స్టేట్ ” భవనంనుంచి దూకి మరణించాలని అనుకున్నాడు. 86వ అంతస్థు గోడ అంచుమీదనుంచి ఒక్క ఉదుటున దూకేసేడు. అనుకోకుండా, ఒక పెనుగాలితరగ చాలా తీవ్రవేగంతో వీచి తలక్రిందుగా పడుతున్న అతడిని మహావేగగతితో, అదే భవనంలో 83వ అంతస్థులోవున్న NBC tv వారి స్టూడియోలోకి విసిరేసింది. సరిగ్గా ఆ సమయానికి అక్కడ ఒక “లైవు” షో జరుగుతోంది. అదే అనువుగా తీసుకుని టి.వి.వారు,అతడి ఆత్మహత్యా ప్రయత్నానికి కారణం వివరించాలని ఆ చిత్రకారుడిని ఇంటర్వ్యూ చేసేరు. ఆ కార్యక్రమంలో భాగంగా చిత్రకారుడు యిలా అన్నాడు.”ఇది ఒక అద్భుతం. ఎందుకంటే ఇప్పుడు నేను మరణించాలనుకోవడం లేదు. బ్రతకాలనుకుంటున్నాను”.
2. ఇజ్రాయెల్ కి, జోర్డాన్ కి మధ్యలో “డెడ్ సీ” అనే పేరున్న ఒక మహాసరస్సువుంది. దీనికి కొన్ని వేల సంవత్సరాల చరిత్రవుంది. జోర్డానునది, చిన్న సెలయేరులు, నీటి ఊటలు అనేకం ఈ డెడ్ సీలోకి ప్రవహిస్తాయి. దీనిలోనించి బయటకి వెళ్ళే ప్రవాహాలేమీలేవు. దీనిలోకి అనేక ప్రవాలహాలద్వారా బోలెడు ఉప్పు, అధికపరిమాణంలో పొటాసియం, బ్రోమిన్ , సోడియం, క్లోరిన్ , సల్ఫేట్ , కేల్సియం, మెగ్నీసియం మొదలైనవి నిత్యమూ చేరిపోతూంటాయి. ఇది 932 చతురపు కిలోమీటర్ల వైశాల్యం కలిగివుంటుంది. 305 మీటర్లలోతుతో వుంటుంది. దీని జలసాంద్రత చాలా ఎక్కువకనక దీనిలోపడి మనిషి ములిగిపోయి మరణింౘడం చాలా కష్టం. దీనిలొని ఉప్పు మామూలు సముద్రాల లోని ఉప్పుకంటె ఆరు రెట్లు అధికంగా వుంటుంది.
3. 1970—80 మధ్య దశకంలో అమెరికా పాప్ సంగీతరంగంలో “బే సిటీ రోలర్సు గ్రూపు“, గొప్ప ఛార్టు బస్టర్సుతో ప్రపంచ పాప్ సంగీత ప్రియులని వెర్రెత్తించేసేరని చెప్పాలి.మొదటవారు తమ సంగీతసంఘానికి పేరు ఏంపెట్టాలా అని ఆలోచనలో పడ్డారు. ప్రపంచపటంలో ఏదోఒకచోట తగిలేలాగ ఒక సూదిని(కంటితో చూడకుండా) గుచ్చేరు. అది మిషిగాన్ లోని బే సిటీ రోలర్సు లో గుచ్చుకుంది. ఆ విధంగా ఆ గ్రూపుకి ఆ పేరు స్థిరం
ఐంది. వారి ద్వారానే మడోనా అరంగేట్రం చేసింది.
స్వస్తి ||
ఈ సారి మూడు అంశాలూ చాలా అద్భుతంగా ఉన్నాయి.ఒకటవ దాంట్లో చచ్చిపోదాం అనుకున్నవాడు చావలేక పోవడం,
రెండో దాంట్లో ‘డెడ్ సీ’ అని పేరున్నా, చావ దలుచుకున్నవాడికి
ములిగి మరణించే అవకాశం లేకపోవడం చిత్రంగా ఉంది.