Fun facts – 20
శ్రీశారదా దయా చంద్రికా :—
04—11—2017; శనివారము.
వాస్తవాలు—వినోదాలు/Fun-Facts~20.
1.మెదడుకి మేత అంటే ఫుడ్ ఫర్ థాట్ మొదట గమనిద్దాం. ఒక ఫుడ్ స్టేటిస్టీషియన్ లెక్క ప్రకారం, పాశ్చాత్య దేశాలలో, ఒక వ్యక్తియొక్క సగటు జీవితంలో తీసుకునే ఆహారం వివరాలు మొత్తంమీద, సుమారుగా ఈ విధంగా ఉంటాయట:—
|) ఒక వ్యక్తి తన జీవితకాలంలో సుమారు 30,000 గ్రుడ్లు తీసుకుంటాడట.
||) 6,000 రొట్టెముక్కలు- లోవ్స్ ఆఫ్ బ్రెడ్ – తీసుకుంటాడట.
|||)9,000 పౌనుల బంగాళాదుంపలు తింటాడట.
||||)8,000 పౌనుల బీఫ్ తింటాడట.
|||||) 550 కోళ్ళు గుటకాయ స్వాహా చేస్తాడట.
||||||) 120 గొర్రెలు గుటకాయస్వాహా.
|||||||) 150 పందులు డిటో.
||||||||) 50 దూడలు డిటో.
IIIIIIIII) 7,000 పౌనుల చేపలు భుజిస్తాడట.
2. ఆల్బెట్రాస్ – Albatross – అనే ఒక గొప్ప పక్షివుంది. అది సాధారణంగా దక్షిణ మహాసముద్ర సీమలలో నివసింౘడాకి యిష్టపడుతుంది. అది పక్షులలో పరివ్రాజకజీవి అని చెప్పాలి. మహా సంచారపక్షిగా దానికి బిరుదు ఇవ్వాలి. మనకాలంలో సజీవంగావున్న పక్షి జాతులలో అన్ని పక్షుల కన్న పరిమాణంలో ఇదే పెద్దది. ఇది పూర్తిగా రెక్కలు విస్తరిస్తే, ఈ చివరినుంచి ఆ చివరికి 11 అడుగుల నిడివివుంటుంది. దీని శరీరం పొడుగు సుమారు 4 అడుగులు దాటివుంటుంది. ఇది సగటున 6.6 కేజీల బరువుంటుంది. ఇవి గంటకి సుమారు 159 కిలోమీటర్ల పరిమితివరకు ఎగరగలవు. 10 రోజుల వ్యవధిలో ఈ జాతి పక్షులు 3,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన దాఖలాలువున్నాయి.
3. 1960 లలో రాబర్ట్ కెనడీ అమెరికాలో ఒక డిబేట్ లో పాల్గొన్నాడు. “ఆటోమోబైల్స్ అధిక ఉత్పత్తి వలన వాతావరణానికి జరిగిన హాని” అనే విషయం మీద చర్చ జరిగింది.ఆ సందర్భంలో రాబర్ట్ కెనడీ ఇలాగ అన్నాడు. “కార్లు కనిపెట్టి లోకానికి బహూకరించిన హెన్రీ ఫోర్డు జీవితానికి ఒక విలక్షణమైన విపరీతన్యాయం- ఐరానిక్ జస్టిస్ – జరిగినట్లు కనిపిస్తుంది. డెట్రాయిట్ లోని ఆయన పుట్టిన యిల్లు, ఇప్పుడు, కార్లు ఎక్కువగా తిరిగే ఒక కాంక్రీటు రహదారి కూడలి మధ్యలో చిక్కుబడిపోయివుంది”.
Amazing facts and figures
nice info mavayya
మనిషి తినడానికే పుట్టేడేమో..అన్నట్టుగా ఉంది….ఈ గణాంకాలు చూస్తోంటే. ఆల్బెట్రాస్ పక్షి గురించి చదవడం ఇదే మొదటిసారి.
“అహమన్నం అన్నమదంతం అద్మి…”
So informative.