Fun facts – 18

శ్రీశారదా దయా చంద్రికా :—
21—10—2017; శనివారము.

వాస్తవాలు—వినోదాలు/Fun-Facts~18.

1. 20వ శతాబ్ద ప్రారంభంలో దక్షిణ ఆఫ్రికా వారి రైల్వే శాఖలో సిగ్నల్ మన్ గా జిం వైడ్ పని చేసేవాడు.ఆయనకి ఒక కాలులేదు. ఆయన చక్రాలకుర్చీ
సాయంతో తనపని నిర్వహించేవాడు. చాక్మా జాతికిచెందిన ఒక బేబూనుని అంటే ఒక ప్రత్యేకమర్కటాన్ని పెంచి దానికి మంచి తరిఫీదుకూడా యిచ్చేడు. దాని పేరు జాక్ . జిం దాన్నితన “కాలు మనిషి/లెగ్ మన్ ” అని అందరికి చెప్పేవాడు. జాక్ తన యజమాని జిం వైడ్ ని చక్రాలకుర్చీలో సిగ్నల్ బాక్స్ దగ్గరకి తోసుకెళ్ళడం లేకపోతే బాక్స్ నుంచి వెనక్కి తీసుకునిరావడం యజమాని ఆజ్ఞలని అనుసరించి చేసేది. జాక్ తెలివితేటలు ఆశ్చర్యం కలిగించే స్థాయిలోవుండేవి. సిగ్నలు బాక్సులో కొన్ని లీవర్లనికూడా అది స్వయంగా ఆపరేట్ చేయగలిగేది. “ప్రజ్ఞానం బ్రహ్మ” అన్నారుకదా! తెలివి ఏ ఒక్క వ్యక్తి-జాతి సొత్తు కాదుమరి!

2. ఇంగ్లండు లో ఒక కాలంలో 7 లక్షల మంది “స్మిత్ ” అనే పేరుతో టెలిఫోను వినియోగదారులు ఉండేవారుట. చైనాలో 7.5 కోట్ల “చాన్ ” అనే పేరు
గల వ్యక్తులుంటే వారిలో దగ్గర-దగ్గరగా ఒక కోటిమంది టెలిఫోను వాడకం దారులు ఉండేవారట.

3. లారెన్సు ఒలీవియరు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఆంగ్ల రంగస్థల/చలనచిత్ర నటుడు. ఆయన తన నాటకాలలో రంగస్థలం మీదకి రావడానికిముందు, గ్రీన్ రూంలో తన సంభాషణ సౌలభ్యాన్ని ౘక్కబరుచుకోవడంకోసం ఈ దిగువ ఉన్న “టంగ్ -ట్విస్టర్ ” ని తరచు తనలో తాను అనుకొంటూవుండేవాడట.

Betty Botter bought a bit of butter, ‘But,’ she said, ‘this butter is bitter. If I put it in my batter it will make my batter bitter. But a bit of better butter will make my batter better.’ So Betty Botter bought a bit of better butter, and it made her batter better.”

You may also like...

1 Response

  1. సి.యస్ says:

    ఈసారి మూడు అంశాలూ ముచ్చటగాఉన్నాయి. వినోదమే కాకుండా విషయపరంగా కూడా బాగున్నాయి. జంతువుల్ని చాలామంది దివ్యాంగులు తమకి సహాయకారిగా ఉపయోగించుకోవడం –అవి తెలివితేటలతో వ్యవహరించడంఇప్పటికీ చూస్తూంటాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *