కదంబకం — 14 : సంస్కృతలోకోక్తులు
శ్రీశారదా దయా సుధ :—
01—10—2017; ఆదిత్యవారము.
కదంబకం — 14.
ఈ రోజు “కదంబకం”లో మనకి సదా ఉపయోగపడే సంస్కృతలోకోక్తులు, తెలుగు అనువాదంతోసహా తెలుసుకుందాం!
1. అనాథో దేవరక్షకః| = దిక్కులేనివారికి దేవుడే దిక్కు.
2. అన్నస్య క్షుధితం పాత్రమ్ | = ఆకలితోవున్నవాడే అన్నదానానికి పాత్రుడు.
3. అపృష్టోzపి శుభం బ్రూయాత్ | = అడగకపోయినా శుభాన్నే పలకాలి.
4. అర్థస్య పురుషో దాసః | = డబ్బుకి మనిషి దాసుడు.
5. ఆయుః అన్నం ప్రయచ్ఛతి | = ఆయుర్దాయమే అన్నాన్ని పెడుతుంది.
6. ఆలస్యాత్ అమృతం విషమ్ | = ఆలస్యంవల్ల అమృతం విషమైపోతుంది.
7. ఇచ్ఛామాత్రా ప్రభోః సృష్టిః | = దేవుడు సంకల్పంతోటే సృష్టిస్తాడు.
8. ఉత్తమా కులవిద్యాస్యాత్ | = కులవిద్య ఉత్తమమైనది.
9. ఉష్ణం ఉష్ణేన శీతలమ్ | = వేడి, వేడితోనే ౘల్లబడుతుంది.
10. కాంచనాత్ కర్మ మోచనమ్ | = ధన/సువర్ణ వ్యయం/దానం ద్వారా కర్మఫలంనుంచి విముక్తుడుకావచ్చు.
మరొకసారి మరికొన్ని చూడవచ్చు.
స్వస్తి ||
చాలా బాగున్నాయి sir
ఇందులో కొన్ని సూక్తులు మనం యథాతథంగా విడేస్తూంటాం….తెలుగువేనేమో అన్నంతగా….వాటికి సమాంతరంగా తెలుగులో అంటే లోకోక్తి రూపంలోనే ఉంటే, అర్ధంతో పాటు అవికూడా తెలియచేస్తే ఆనందిస్తాం (దిక్కులేని వారికి దేముడే దిక్కు లాగ)
Taatagaari gurinchi na writeup baagundi. Sanskrit suukttulu baagunnayi
‘ఆలస్యం అమృతం విషం’ అనే విన్నాం చిన్నప్పుడు. అది కరెక్టా “ఆలస్యాత్…” కరెక్టా?
Dhanyavaadamulu guruvugaru