Fun facts – 14

శ్రీశారదా దయా చంద్రిక :—
23—09—2017; శనివారము.

వాస్తవాలు-వినోదాలు/Fun-Facts-14.

1. మన మనుష్యులలో “స్పైడర్ మేన్ ” లేడుకనక ఆ పేరుతో సినిమాలు తీసుకుని సంబరపడిపోతున్నాం. పీతలకికూడా ఒక సినిమా లోకం వుంటే అవి చక్కగా “స్పైడర్ క్రేబ్ ” అని బోలెడు మామూలు సినిమాలు, ఏనిమేషన్ చిత్రాలు కాలయాపన లేకుండా వెంటనే తీసేసుకుని వాటి “క్రేబీవుడ్ ” చరిత్రలో లెక్కలేనన్ని బాక్సాఫీసుహిట్లు కొట్టేయవచ్చు. ఎందుకంటే జపానులో పీతలజాతిలో అన్నింటికన్న పెద్దదైన “స్పైడర్ క్రేబ్ ” లేక “సాలీడు పీత” వుంది. దాని పైపెంకు సుమారు ఒక అడుగు వెడల్పు వుంటుంది. దాని డెక్కలు విచ్చుకుంటే ఈ కొస నుంచి ఆ కొసకి పది అడుగుల పొడవు దాటివుంటుంది. ఇంకొక పెద్దపీతవుంది. వారి ప్రత్యేకత ఏమిటంటే, కొబ్బరిచెట్లెక్కి, కొబ్బరి కాయలని కడుపారా ఆరగించడం. చెట్టు ఎక్కేటప్పుడు వీరు తమ డెక్కలని చెట్టుచుట్టురా బిగించి పైపైకి ఎక్కుతూ వెడతారు. నచ్చిన కాయని హాయిగా భోంచేసి దిగివస్తారు.

2. “ది కాల్ ఆ ఫ్ ది వైల్డ్ ” పుస్తక కర్త జాక్ లండన్ తనచిన్నతనంనుంచీ రచయితగా పేరు గడించాలని కలలు కన్నట్టున్నాడు. చిన్నతనంలోనే చాలా పదసంపదని చేకూర్చుకోడానికి చాలా పాట్లు పడ్డాడు. ఏదైనా క్రొత్తమాట దొరికితే దానిని ఒక పెద్దతెల్లకాగితంపైన పెదపేద్ద అక్షరాలలో వ్రాసి, ఆరుబయట బట్టలు ఆరవేసేతీగకి క్లిప్పులతో తగిలించి, తాను తనగదిలోనుంచి చూస్తే కనిపించేలాగ ఏర్పాటుచేసుకుని ఆమాటని చూస్తూ మననం చేస్తూండేవాడు. మాట నోటికి వచ్చినతరవాత ఆ కాగితాన్ని తీసేసి మరొకటి తగిలించేవాడు.

3. ప్రముఖగాయని, గీతరచయిత్రి ఐన డోరీ ప్రెవిన్ భర్త ఆంద్రె, తనభార్య పాటలకి వరసలుకట్టి, తానే సంగీతాన్ని సమకూర్చేవాడట. డోరీని విడిచిపెట్టి, ఆంద్రె, సినీ నటి మియా ఫారోతో వుండేవాడట! హతాశురాలైన డొరీ తన మానసికవ్యధని ఒక క్రొత్త పాటలో ఇలా వ్యక్తంచేసిందిట:— ” Beware of Young Girls“! ఇదీ ఆ పాట!

You may also like...

2 Responses

  1. Devi says:

    Very informative n amusing concepts are selected n presented by you.Thank u mavayya

  2. సి.యస్ says:

    మన పెద్దలు చెప్పే ‘మననం’ జాక్ లండన్ ఎంత బాగా ఆచరించాడో! నిజంగా మంచి రచయిత కాగలిగేడు.స్పైడర్ క్రేబ్ నిజంగా వింత నిజమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *