Fun facts – 13
శ్రీశారదా దయా చంద్రికా :—
16—09—2017; శనివారం.
వాస్తవాలు-వినోదాలు/Fun-Facts-13.
1. ఇంగ్లండుకి చెందిన ప్రఖ్యాతరచయిత అర్నాల్డ్ బెన్నెట్ (Arnold Bennett) 1931 లో పారిస్ నగరానికి సంతోషంగా గడపడానికి వెళ్ళేడు. అక్కడవున్న తన మిత్రులు మామూలు మంచినీళ్ళు త్రాగడానికి విముఖంగా ఉంటే వారిని హేళనచేసేడు. మరిగించని మామూలు మంచినీటిని పూర్తిగా గ్లాసు ఖాళీచేస్తూ త్రాగివేసి, “ఇలాగ నీళ్ళు తీసుకోవడం వలన ఏ హానీ జరగదు” అనికూడా అన్నాడు. దురదృష్టం ఏమిటంటే, కొన్నివారాలలోపే ఆయన టైఫాయిడు విషజ్వరం బారినపడి మరణించేడు.
2. ఓల్గా నది తరువాత యూరపులో రెండవ పెద్ద నది డెన్యూబ్ నది(The Danube river). 2,800 కిలోమీటర్ల పొడవున, ఆరు ఐరోపా దేశాలద్వారా ప్రవహిస్తోంది. జర్మనీ నైరృతి భూభాగంలోని నీలారణ్యం(Black Forest)నుంచి నీలసాగరం(Black Sea)వరకు ప్రవహిస్తూంది. పడమర జర్మనీ, ఆస్ట్రియా, హంగెరి, యుగోస్లావియా,బల్గేరియా, రుమేనియా దేశాలు ఆరింటిని తన అఖండప్రవాహంతో కలుపుతోంది ఈ నది.
అల్మ్ , వియన్నా, బుడాపెస్ట్ ,బెల్ గ్రేడ్లు ఈ నది ఒడ్డున ఉన్న కొన్ని నగరాలు.
3. రాబర్టా స్ట్రీటర్ , షికాసా కౌంటీలో ఒకచిన్న పొలంమీద ఆధారపడి తన బాల్యాన్ని గడిపింది. చిన్నతనమంతా తాను ఒక గాయనీతారగా వెలుగుతానని కలలు కంది. ఆమెతల్లి వారికి ఉన్న రెండు ఆవులలో ఒకదానిని అమ్మి ఒక వాడిన(సెకండ్ హేండ్ )పియానోని తనకూతురిముచ్చటని తీర్చడానికి, ఆమెని సంగీతంలో ప్రోత్సహించడంకోసం కొంది. రాబర్టా “రూబీ జెంట్రీ” అనే చలనచిత్రం చూసి, తన పేరు “బాబీ జెంట్రీ“గా మార్చేసుకుంది. ప్రపంచప్రఖ్యాతి పొందిన “ఓడ్ టు బిల్లీ జో” అనే పాట వ్రాసి, దానికి సంగీతరచన కూర్చి, తానే పాడి గొప్పగాయకిగా తారాపథం ఏలింది, బాబీ జెంట్రీ!
స్వస్తి ||
మన దేశంలోవే అయినా, రాష్ట్రాల మధ్య నీటి పంపకం కోసం ఎంతెంత తగాదాలౌతున్నాయో…, కోర్టుల్లో పడి కొట్టుకుంటున్నారు. అలాంటిది ఒకే నది నీరు ఆరు దేశాలు పంచుకోవడం ఎంత గొప్ప విషయం?
బాబీ జెంట్రీ సమాచారం కూడా ఆసక్తికరంగా ఉంది